Begin typing your search above and press return to search.

తారక్.. రెండేళ్ళ గ్యాప్ లోనే మూడు బడా సినిమాలు

ఈ సాంగ్ లో తారక్ యాక్షన్ అండ్ ఎలివేషన్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   21 May 2024 12:30 AM GMT
తారక్.. రెండేళ్ళ గ్యాప్ లోనే మూడు బడా సినిమాలు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అతను చేస్తోన్న సినిమాలకి సంబంధించి కీలక అప్డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దేవర మూవీ నుంచి అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అన్ని భాషలలో కూడా భారీగా వ్యూస్ సొంతం చేసుకుంటూ తారక్ అభిమానులని ఫుల్ పాజిటివ్ వైబ్ లోకి తీసుకొని వెళ్ళిపోయింది.

ఈ సాంగ్ లో తారక్ యాక్షన్ అండ్ ఎలివేషన్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో దేవర ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందుకి కూడా రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ లో పెద్ద సినిమాలేవీ లేకపోతే దేవరని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక తారక్ ప్రస్తుతం దేవరతో పాటు, హిందీలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉండబోతోంది. అయితే ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ తారక్ బర్త్ డే సందర్భంగా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తారక్ మూవీ షూటింగ్ ఆగష్టు నుంచి మొదలు కాబోతోందని కన్ఫర్మ్ చేశారు.

వార్ 2 మూవీ 2025 ఆగష్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ 2026 వేసవికి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డ్రాగన్ అనే పేరుని టైటిల్ గా పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ బట్టి మూవీ ఎంత వైలెంట్ గా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ మూడు సినిమాలు రెండేళ్ల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. తారక్ ఇమేజ్ ని కూడా ఈ చిత్రాలు నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తాయనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ఇమేజ్ దిశగా దూసుకుపోతున్న తారక్ కి కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో దేవర, వార్2, ప్రశాంత్ నీల్ చిత్రాలు స్ట్రాంగ్ మార్కెట్ ని క్రియేట్ చేస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.