'ఓ రోమియో' కోసం తమన్నా, విక్రాంత్ మాస్సే త్యాగం!
ముంబయి అండర్ వరల్డ్ డాన్‌ల రియల్ స్టోరీస్‌లతో రూపొందిన బుక్ `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి`.
By: Tupaki Desk | 10 Feb 2026 4:00 AM ISTముంబయి అండర్ వరల్డ్ డాన్‌ల రియల్ స్టోరీస్‌లతో రూపొందిన బుక్ `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి`. దీని ఆధారంగా ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ `గంగుబాయి కతియావాడి`ని రూపొందించిన సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరోసారి ఇదే బుక్‌ని ఆధారం చేసుకుని విశాల్ భరద్వాజ్ మరో గ్యాంగ్‌స్టర్ స్టోరీని తెరపైకి తీసుకొస్తున్నారు అదే `ఓ రోమియో`. షాహీద్ కపూర్ హీరోగా నటించాడు. `యానిమల్` ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్. ఫిబ్రవరి 13న భారీ స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీలోని కీలక పాత్రల్లో విలక్షణ నటుడు నానా పటేకర్, తమన్నా, దిషా పటానీ, అవినాష్ తివారీ, ఫరీదా జలాల్ నటిస్తున్నారు. మరో కీలక అతిథి పాత్రలో `12th ఫెయిల్` ఫేమ్ విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ ఉస్తారాగా షాహీద్ కపూర్ నటించగా, అతని ప్రేయసి అఫ్‌షాగా త్రిప్తి దిమ్రీ నటించింది. ఇటీవల ఉస్తారా కుమార్తె అభ్యంతరాలు చెప్పడం, కోర్టును ఆశ్రయించడంతో వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకుల్ని అధిగమించి ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తొలి సారి దర్శకుడు విశాల్ భరద్వాజ్ రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో చేసిన ఈ మూవీ ఇప్పటికే బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ప్రయోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మూవీలో నటించిన తమన్నా, విక్రాంత్ మాస్సేలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుండగా, విక్రాంత్ మాస్సే కీలక అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ క్యారెక్టర్ల కోసం ఈ ఇద్దరు స్టార్స్ ఓ త్యాగం చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వయంగా సినిమా ప్రమోషన్స్‌లో వెల్లడించడం గమనార్హం. ఇంతకీ విషయం ఏంటంటే ఈ మూవీలో నటించడానికి తమన్నా, విక్రాంత్ మాస్సే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. డైరెక్టర్ విశాల్ భరద్వాజ్, నిర్మాత సాజిద్ నదియావాలాపై ఉన్న నమ్మకంతో ఎలాంటి పారితోషికం తీసుకోలేదట.
రెమ్యూనరేషన్‌లకు మాత్రం ప్రియారిటీ ఇచ్చే బాలీవుడ్‌లో తమన్నా, విక్రాంత్ మాస్సే `ఓ రోమియో` కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో తమన్నా రబియాగా, దిషా పటానీ జూలీగా కనిపించనున్నారు. విక్రాంత్ మాస్సే మాత్రం ఓ ప్రత్యేక అథిగా క్యారెక్టర్‌లో మెరవనున్నాడు. గతంలో విశాల్ భరద్వాజ్‌కు చేసిన ప్రామిస్ కారణగానే తను పారితోషికం తీసుకోలేదని చెబుతున్నారు. ఇక తమన్నా ఈ మూవీ కోసం 12 రోజులు కేటాయించిందట. స్టోరీతో తనది కీ రోల్ కావడం, తక్కువ టైమ్ మాత్రమే ఉండటం, మంచి ఇంపాక్ట్ కలిగించే క్యారెక్టర్ కావడం, విశాల్‌భరద్వాజ్ సినిమా కావడం వల్లే తమన్నా కూడా పారితోషికం తీసుకోలేదట.
