మనసులో బాధ బయట పెట్టిన తమన్నా..!
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గతంతో పోల్చితే తమన్నా ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు అందుకోలేక పోతుంది.
By: Tupaki Desk | 18 July 2025 8:15 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. గతంతో పోల్చితే తమన్నా ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు అందుకోలేక పోతుంది. ఒకటి రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చినా అవి వర్కౌట్ కావడం లేదు. పెద్ద సినిమాల్లో ఎక్కువ శాతం ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. కెరీర్ చివరి దశలో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చిందని కొందరు అంటున్నారు. ఇప్పటికే తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయిందని కొందరు అంటున్నారు. మొత్తానికి తమన్నా కెరీర్ అటు ఇటుగానే ఉన్న విషయం తెల్సిందే.
సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షో లు, మ్యూజిక్ ఆల్బమ్స్ పేరుతో తమన్నా బిజీ బిజీగా ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా స్టార్‌డం తమన్నాకి లేదనే విషయం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో తమన్నా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మిల్కీ బ్యూటీ తమన్నా నటుడు విజయ్ వర్మతో విడిపోయిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చాలా మంది తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వీరిద్దరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా మిల్కీ బ్యూటీ తన ఫోటోలను షేర్ చేసి పోస్ట్ చేసిన నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తన రెగ్యులర్ డే ఫోటోలు, వీడియోలను తమన్నా షేర్ చేసింది. అంతే కాకుండా నోట్‌లో.. ప్రస్తుతం తాను గుర్తించే దశలో ఉన్నాను. సగం డిజైనర్, సగం డిటెక్టివ్‌గా నేను ఉన్నాను అనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో ప్రతీది చాలా ముఖ్యం. అంతే కాకుండా ప్రతి తప్పు మనకు ఏదో ఒకటి బోధిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుతం మనం పరిపూర్ణం కాదు, అయితే మనం దారిలోనే ఉన్నాం, ముందు ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి వస్తువు మెరిసేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది అనే అర్థం వచ్చే విధంగా తమన్నా పేర్కొంది.
తమన్నా ఉన్నట్లుండి ఇలాంటి నోట్ రాయడంతో చాలా మంది ఇది బ్రేకప్‌కి సంబంధించిన నోట్ అయ్యి ఉంటుందని ఊహిస్తున్నారు. చాలా మంది ఈ విషయం గురించి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత అయినా తమన్నా ఈ విషయం గురించి ఏదో ఒకటి స్పందించిందని, ముందు ముందు మరింతగా తన బ్రేకప్ గురించి ఓపెన్ కావాలని అభిమానులు కోరుతున్నారు. మనసులో ఉన్నది అంతా బయటకు వదిలేసి ఫ్రేష్‌గా తమన్నా జర్నీ స్టార్ట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు. కానీ ఆమె గట్టిగా ప్రయత్నిస్తే తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఆఫర్లు బాగానే వస్తాయి. మరి తమన్నా ఆ దిశగా ముందు ముందు ప్రయత్నాలు చేసేనా చూడాలి.
