Begin typing your search above and press return to search.

సూర్య43 మ‌రోసారి ఆకాశ‌మే హ‌ద్దు

దీనికి తాత్కాలికంగా సూర్య 43 అని పేరు పెట్టారు. ప్రతిభావంతులైన నటులు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫహద్, విజయ్ వర్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తారు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 11:31 AM GMT
సూర్య43 మ‌రోసారి ఆకాశ‌మే హ‌ద్దు
X

జాతీయ అవార్డు గ్ర‌హీత‌, ద‌ర్శ‌కురాలు సుధా కొంగర 2020లో `సూరరై పొట్రు` లాంటి బ్లాక్ బస్ట‌ర్ ని తెర‌కెక్కించారు. సూర్య ఇందులో క‌థానాయ‌కుడు. తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా టైటిల్ తో విడుద‌లై ఇక్క‌డా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్ గోపీనాథ్ పాక్షిక బయోపిక్. విమర్శకుల ప్రశంసలు అందుకోవ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. అవార్డులు రివార్డులు కొల్ల‌గొట్టింది. సూర్య‌తో మ‌రోసారి సుధా కొంగ‌ర ప‌ని చేస్తార‌ని కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నా అధికారికంగా ధృవీక‌ర‌ణ లేదు.

తాజా స‌మాచారం మేర‌కు ..సూర్య 43వ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారని స‌మాచారం. దీనికి తాత్కాలికంగా సూర్య 43 అని పేరు పెట్టారు. ప్రతిభావంతులైన నటులు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫహద్, విజయ్ వర్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తారు. నిర‌స‌న‌ల‌తో అట్టుడికే ఒక ఉద్య‌మ రూపం లాంటి పోస్ట‌ర్ ని తాజాగా విడుద‌ల చేసింది. ఇది జీవీ ప్ర‌కాష్ కి మైలు రాయి చిత్రం. అత‌డికి 100వ సినిమా కావ‌డం విశేషం. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. టీమ్ మొత్తం సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సూర్య ట్వీట్ చేశారు. మేము మరోసారి ఎమోషనల్ రైడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు.

అదే స్ఫూర్తిని ర‌గిలించాలి:

ఆకాశం నీ హ‌ద్దురా! అంటూ సూర్య ఎంతో స్ఫూర్తివంత‌మైన క‌థ‌లో న‌టించారు. ఎవ‌రైనా ఎద‌గానికి ఆకాశ‌మే హ‌ద్దు.. ఆలోచ‌న ఆచ‌ర‌ణ‌ ఉండాలే కానీ.. ఏదైనా సాధ్య‌మేన‌ని నిరూపించాడు ఎయిర్ డెక్క‌న్ అధినేత‌. అత‌డి పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు సూర్య‌. ఇప్పుడు సుధ కొంగ‌ర‌తో ఎలాంటి క‌థాంశంలో న‌టిస్తారు? అన్న‌ది స‌స్పెన్స్. త్వ‌ర‌లోనే దీన‌కి జ‌వాబు దొరుకుతుంద‌నే ఆశిద్దాం.