సూర్య రెట్రో ట్రైలర్ టాక్.. అందరి పల్స్ పట్టేశాడు..!
సూర్య నుంచి ఈమధ్య కొంతకాలంగా డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. కంప్లీట్ మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది.
By: Tupaki Desk | 18 April 2025 6:49 PMకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా రెట్రో. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన రెట్రో యూనిట్ లేటెస్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు.
సూర్య రెట్రో ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది పక్కా కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ సినిమాగా వస్తుంది. సినిమాలో సూర్య వింటేజ్ లుక్, మాస్ యాక్షన్ అంతా కూడా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఐతే ట్రైలర్ లో కథ అంత క్లారిటీగా చెప్పలేకపోయినా ఒక హీరో ఒక విలన్ మధ్యలో సూర్య మాస్ యాక్షన్ హంగామా పక్కా పైసా వసూల్ సినిమాగా అనిపిస్తుంది.
సూర్య నుంచి ఈమధ్య కొంతకాలంగా డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. కంప్లీట్ మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. అందుకే ఫ్యాన్స్ కి కమర్షియల్ సినిమాతో సూపర్ మాస్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు సూర్య. రెట్రో ట్రైలర్ చూస్తే అది పక్కా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందనిపిస్తుంది. ఈ సినిమాను మే 1న రిలీజ్ లాక్ చేశారు. సినిమాలో పూజా హెగ్దే డీ గ్లామర్ లుక్ ట్రైలర్ వరకు జస్ట్ ఓకే అనేలా ఉన్నా సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
సూర్య రెట్రో సినిమాకు శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సూర్య వింటేజ్ లుక్స్ ఆడియన్స్ కి మజా అందిచేలా ఉన్నాయి. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా మే 1న సూర్య రెట్రో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సూర్య రెట్రో సినిమా తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి రెట్రో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. కార్తీక్ సుబ్బరాజు, సూర్య కాంబోలో క్రేజీ మాస్ అటెంప్ట్ గా రెట్రో మూవీ వస్తుంది. ఈ మూవీపై ఉన్న అంచనాలు ట్రైలర్ తో రెట్టింపు అయ్యాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.