Begin typing your search above and press return to search.

సూర్య హీరోయిన్స్ విషయంలో జ్యోతిక ఇన్వాల్వ్ మెంట్..?

ఈ క్రాంలో సూర్య నటించిన కంగువ సినిమాలో హీరోయిన్ గా దిశా పటానిని జ్యోతిక రిఫర్ చేసిందట.

By:  Tupaki Desk   |   20 April 2025 8:30 AM IST
సూర్య హీరోయిన్స్ విషయంలో జ్యోతిక ఇన్వాల్వ్ మెంట్..?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసే ప్రతి సినిమాకు ఆయన సతీమణి జ్యోతిక సపోర్ట్ ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన జ్యోతిక మధ్యలో సినిమాలను ఆపేసి ఫ్యామిలీని చూసుకుంది. ఐతే మళ్లీ ఈమధ్యనే ఆమె తెర మీద కనిపించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోపక్క సూర్య జ్యోతిక కలిసి స్టార్ట్ చేసిన 2డి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ విషయాలను కూడా జ్యోతిక దగ్గర ఉండి చూసుకుంటుంది.

అంతేకాదు సూర్యతో నటించే హీరోయిన్స్ విషయంలో కూడా జ్యోతిక ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని టాక్. ఈ క్రాంలో సూర్య నటించిన కంగువ సినిమాలో హీరోయిన్ గా దిశా పటానిని జ్యోతిక రిఫర్ చేసిందట. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లానింగ్ ఉన్న సినిమా కాబట్టి ఆ సినిమాలో దిశా అయితే పర్ఫెక్ట్ అని ఆమెను తీసుకోమని చెప్పారట. ఐతే ఆ సినిమా ప్రేక్షకులను రుచించలేదు.

ఇక 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య నటిస్తూ నిర్మించిన రెట్రో సినిమాకు జ్యోతిక సజెషన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శ్రీయని తీసుకోమని జ్యోతిక చెప్పారట. ఐతే ఒకప్పటి హీరోయిన్ కాబట్టి ఎవరి టాలెంట్ ఏంటన్నది తనకు ఈజీగా తెలిసిపోతుంది. ఐతే కంగువ, రెట్రో రెండు సొంత బ్యానర్ సినిమాలు కాబట్టి జ్యోతిక తన ఇన్ పుట్స్ ఇవ్వగలిగింది.

సూర్య రెట్రో సినిమాలో శ్రీయ స్పెషల్ సాంగ్ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ కాగా ఆమె పూర్తిగా డీ గ్లామర్ లుక్ తో కనిపించనుంది. ఐతే శ్రీయ సాంగ్ మాత్రం వింటేజ్ లుక్ తో అదిరిపోతుందని టాక్. మరో విశేషం ఏంటంటే ఈ సాంగ్ ని తమిళ్ లో సూర్య పాడారని మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ చెప్పారు. అందుకే ఈ సాంగ్ మీద స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెట్రో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య పూర్తిగా తన ఒకప్పటి వింటేజ్ మాస్ లుక్ తో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా పక్కా కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ లా ఉంది. మరి ఈ మూవీపై సూర్య పెట్టుకున్న హోప్స్ నిజం అవుతాయా లేదా అన్నది చూడాలి.