Begin typing your search above and press return to search.

కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో.. సూర్యతో అందరూ ప్రయోగాలేనా?

కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య లీడ్ రోల్ లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెట్రో మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2025 8:15 AM IST
కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో.. సూర్యతో అందరూ ప్రయోగాలేనా?
X

కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య లీడ్ రోల్ లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెట్రో మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ రోల్ పోషించారు. 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక, సూర్య నిర్మాతలుగా వ్యవహరించిన ఆ మూవీ మే 1వ తేదీన రిలీజ్ కానుంది.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ట్రైలర్ తో మేకర్స్ స్టోరీ లైన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో సినిమాపై అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వలేదు. అయితే రిలీజ్ కు కొద్ది రోజులే ఉండడంతో.. రెట్రో టీమ్ ను మూవీపై హైప్ క్రియేట్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తోంది. ఆ సమయంలో మూవీ క్యాస్టింగ్ అండ్ టెక్నికల్ టీమ్ పలు విషయాలను పంచుకుంటోంది. రీసెంట్ గా రెట్రో సినిమాకు మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. లాల్ సింగ్ చద్దా మూవీ స్పెషల్ స్క్రీనింగ్ టైమ్ లో అమీర్ ఖాన్ వ్యాఖ్యలను గుర్తుచేశారు.

ఆ సమయంలో లాల్ సింగ్ చద్దా విజయం తన కెరీర్ రూట్ ను డిసైడ్ చేస్తుందని అమీర్ అన్నట్లు సంతోష్ నారాయణ్ తెలిపారు. ఆ మూవీ ప్రయోగాత్మక చిత్రమని, అమీర్ ఖాన్ తన స్ఫూర్తిగా చెప్పారు. కానీ ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఆడియన్స్ ను నిరాశపరిచి డిజాస్టర్ గా మారింది.

ఇప్పుడు రెట్రో మూవీ కూడా ప్రయోగాత్మక మూవీని సంతోష్ నారాయణ్ పరోక్షంగా తెలిపారు. ఆ సినిమా రిజల్ట్ బాగుంటే.. తన మ్యూజిక్ కెరీర్ దూసుకుపోతుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది. రెండు సినిమాల కంపేరజన్ ఒకెత్తు అయితే.. సూర్య డైరెక్టర్స్ శైలి గురించి కామెంట్లు పెడుతున్నారు.

కేవలం సూర్యతో పనిచేసినప్పుడే దర్శకులు ఎందుకు ప్రయోగిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. రీసెంట్ గా సిరుత్తై శివ డైరెక్షన్ లో సూర్య చేసిన కంగువా ప్రయోగాత్మక సినిమానే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. అంతకుముందు సూర్యతో సెల్వరాఘవన్ తీసిన NGK ఒక ఎక్సెపెరిమెంటే. ఇప్పుడు రెట్రో మూవీ.. ప్రయోగాత్మకమైనదేనని సంతోష్ నారాయణ్ అని ఇండైరెక్ట్ గా చెప్పారు. దీంతో నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి రెట్రో ఎలా ఉంటుందో చూడాలి.