Begin typing your search above and press return to search.

సూర్య కంగువ వచ్చేస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ.

By:  Tupaki Desk   |   21 July 2023 12:11 PM GMT
సూర్య కంగువ వచ్చేస్తున్నాడు..!
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమాను జ్ఞానవెల్ రాజా, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా రాబోతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ పై చిత్ర యూనిట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. జూలై 23న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా కోసం సూర్య చాలా వర్క్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కథ గురించి ఎలాంటి లీక్స్ రాకపోయినా టీజర్ తోనే సినిమాపై ఒక ఇంప్యాక్ట్ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

సూర్య కంగువ సినిమా లో బాలీవుడ్ భామ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో వెట్రి సినిమాటోగ్రఫీ ప్లస్ అవనుంది. బాహుబలి తర్వాత ఇలాంటి భారీ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే కోలీవుడ్ నుంచి మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, 2 సినిమాలు వచ్చాయి. అయితే వాటి స్పూర్తితో కంగువ సినిమా రాబోతుంది. ఇక టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ ని చేస్తూ సూర్య గుర్రం మీద ఉన్న బ్యాక్ ఫోటోని రివీల్ చేశారు.

కెరీర్ లో ఇప్పటివరకు సూర్య ఇలాంటి పీరియాడికల్ స్టోరీలో నటించలేదు అందుకే కంగువ మీద ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. బాహుబలి తరహాలో టీజర్ తోనే సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పరచాలని చూస్తున్నారు మేకర్స్. కొన్నాళ్లుగా సూర్య డిఫరెంట్ కథలు చేస్తూ వస్తున్నాడు. సామాజిక అంశాలతో తన మార్క్ నటనతో మెప్పిస్తూ ఈమధ్య సినిమాలు చేస్తున్న సూర్య కంగువతో సరికొత్త సంచలనాలు సృష్టించాలని చూస్తున్నాడు.

కంగువ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేయనున్నారు. సూర్య శివ కాంబినేషన్ లో కంగువ కోలీవుడ్ బాహుబలిగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. లేటెస్ట్ గా ట్విట్టర్ నుంచి ఇలాంటి యోధుడు.. ఇలాంటి రాజు మరెవరు లేరు కామెంట్ పెట్టారు. మరి ఈ యోధుడి కథ నేషనల్ లెవల్ లో ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి. సూర్య కంగువ ప్రీ పోస్టర్స్ అన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. సినిమా టీజర్ కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం సినిమా రికార్డులను సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.