Begin typing your search above and press return to search.

సూర్య కంగువ టార్గెట్ పెద్దదే..!

సినిమా తప్పకుండా పాన్ ఇండియా లెవెల్ లో 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని ఆయన అన్నారు.

By:  Tupaki Desk   |   25 July 2023 10:01 AM GMT
సూర్య కంగువ టార్గెట్ పెద్దదే..!
X

కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాలకు దూరంగా సామాజిక అంశాల నేపథ్యంతో సినిమాలు చేస్తూ వచ్చిన సూర్య ఈసారి ఒక యోధుడి కథతో ఆడియన్స్ ని అలరించాలని వస్తున్నాడు. శివ డైరెక్షన్ లో సూర్య లీడ్ రోల్ లో వస్తున్న సినిమా కంగువ. ప్రీ పోస్టర్స్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా చేసిన మేకర్స్ రీసెంట్ గా సినిమా నుంచి గ్లింప్స్ వదిలి అంచనాలను రెట్టింపు చేశారు. సూర్య కంగువ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అదరగొట్టేసింది. శివ డైరెక్షన్, సూర్య యాక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినట్టు ఉన్నాయి.

సూర్య కంగువ సినిమాను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే కంగువ మీద దర్శక నిర్మాతలకు భారీ నమ్మకం ఉందని తెలుస్తుంది.

సినిమాలో నటించిన ధనుంజయ్ కంగువ సంచలనాలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. సినిమా తప్పకుండా పాన్ ఇండియా లెవెల్ లో 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని ఆయన అన్నారు.

సూర్య కంగువ సినిమా కూడా బాహుబలి, పుష్ప, కె.జి.ఎఫ్ తరహాలోనే పార్ట్ 2, 3 కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వాటికి సంబంధించిన కథలు కూడా రెడీ చేశారట. అయితే కంగువ సీక్వల్ ఉంటుందా లేదా అన్నది కంగువ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా 2024 ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సూర్య తన కెరీర్ లో ఇప్పటి వరకు చేయని వీర యోధుడు పాత్రలో కనిపిస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత కోలీవుడ్ నుంచి కూడా అలాంటి ఒక అటెంప్ట్ చేయాలని అనుకున్నారు.

అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమా చేసినా అది కేవలం తమిళ ఆడియన్స్ కి నచ్చింది తప్ప మిగతా భాషల్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. సూర్య కంగువ మాత్రం అన్ని భాషల్లో వర్క్ అవుట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే సూర్య కంగువకి నార్త్ సైడ్ నుంచి 400 కోట్ల దాకా బిజినెస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక సౌత్ బిజినెస్ కూడా భారీగా ఉండబోతుంది. సో ఎలా లేదనా సూర్య కంగువ బిజినెస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుంది.