Begin typing your search above and press return to search.

44 కి ముహూర్తం పెట్టేసిన హీరో!

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య పిరియాడిక్ థ్రిల్ల‌ర్ `కంగువ` తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2024 5:53 AM GMT
44 కి ముహూర్తం పెట్టేసిన హీరో!
X

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య పిరియాడిక్ థ్రిల్ల‌ర్ `కంగువ` తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. పిరియాడిక్ థ్రిల్ల‌ర్ కి టైమ్ ట్రావెల్ నేప‌థ్యాన్ని జోడించ‌డంతో? ఈ కాంబో కొత్త‌గా ఏదో చెప్ప‌బోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం `కంగువ` రిలీజ్ ఎప్పుడు? అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

ఇప్ప‌టికే అక్టోబ‌ర్ -డిసెంబ‌ర్ నెల‌ల్లోనే రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. షూటింగ్ కూడా పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే విఎఫ్ ఎక్స్ ..గ్రాఫిక్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అందుకే రిలీజ్ తేదీపై యూనిట్ క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఇక సూర్య పోర్ష‌న్ కి సంబంధించిన షూట్ ఎప్పుడో పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ద‌ర్శ‌కుల క‌థ‌లు విన‌డం జ‌రిగింది. సూర్య 44 వ సినిమా ఛాన్స్ ఏ ద‌ర్శ‌కుడికి దొరుకుతుంది? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. తాజాగా ఆ ఛాన్స్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌క్కించుకున్న‌ట్లు తేలిపోయింది.

కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ సూర్య‌ అవుతున్నారు. జూన్ రెండో వారం నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభిచాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు 80 శాతం సెట్స్ లో నే ఉంటుందిట‌. దీంతో ఈసినిమా షూట్ చెన్నై ప‌రిస‌రాల్లోనే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఔట్ డోర్ షూటింగ్ 20 శాత‌మే ఉండ‌టంతో హైరానా ప‌డాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

హీరోయిన్ ఎంపిక ప‌నుల్లో ద‌ర్శ‌కుడు బిజీగా ఉన్నారు. ఈనెల‌ఖ‌రుక‌ల్లా హీరోయిన్ పై ఓ క్లారిటీ వ‌స్తుంది. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు జోజు జార్జ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్రేమ‌..వినోదం..యాక్ష‌న్ అంశాలతో కార్తీక్ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. కార్తీక్ గ‌త సినిమా జ‌గ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ ఎల్ మంచి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న `గేమ్ ఛేంజ‌ర్` కి స్టోరీ రాసింది కూడా ఇత‌డే.