'రెట్రో' ప్రీరిలీజ్‌కు రౌడీ అందుకే వచ్చాడా?
భారీ అంచనాలు పెట్టుకున్న సూర్యకు షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై పడింది.
By: Tupaki Desk | 15 May 2025 10:31 AM ISTహీరో సూర్య గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. రీసెంట్‌గా `కంగువ`తో భారీ డిజాస్టర్‌ని ఎదుర్కొన్న సూర్య ఫ్లాపుల పరంపర నుంచి బయటికి రావడం కోసం చేసిన సినిమా `రెట్రో`. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న సూర్యకు షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై పడింది.
`రెట్రో` తరువాత సూర్య మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లని అంగీకరించారు. అందులో 45వ ప్రాజెక్ట్‌ని ఆర్.జె.బాలాజీతో చేస్తున్నాడు. ఇదొక రూటెడ్ స్టోరీతో డివోషనల్ టచ్‌తో రూపొందుతోంది. దీనిపై సూర్య భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. దీని తరువాత సూర్య తన 46వ ప్రాజెక్ట్‌ని మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. దీనికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. దుల్కర్ సల్మాన్‌తో `లక్కీ భాస్కర్` వంటి బ్లాక్ బస్టర్‌ని అందించిన తరువాత వెంకీ అట్లూరి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ సినిమా కోసం తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. ఇందులోని ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం హీరో విజయ్ దేవరకొండను అనుకుంటున్నారని, ఇప్పటికే విజయ్‌కి దర్శకుడు వెంకీ అట్లూరి కథని కూడా వినిపించాడని, క్యారెక్టర్ ఇంప్రెస్ చేయడంతో విజయ్ దేవరకొండ ఈ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఇన్ సైడ్ టాక్.
సితారలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్` మూవీ చేస్తున్నాడు. ఆ చొరవతో నిర్మాత నాగవంశీ రౌడీని అడగడం, సూర్య సినిమా కాబట్టి చేస్తానని విజయ్ ముందుకొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే విజయ్ దేవరకొండ `రెట్రో` ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలని హీరో విజయ్ దేవరకొండ కానీ మేకర్స్ కానీ దృవీకరించలేదు. దీనిపై త్వరలోనే సితార నేంచి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందట.
