Begin typing your search above and press return to search.

సూర్య - వెంకీ.. సర్ ప్రైజ్ ఏమిటంటే..

తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్య 46’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   23 Jun 2025 1:24 PM IST
సూర్య - వెంకీ.. సర్ ప్రైజ్ ఏమిటంటే..
X

తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్య 46’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమాకు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సూర్య ఇటీవల జై భీమ్, రెట్రో వంటి సినిమాలతో తన పెర్ఫామెన్స్‌కు మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ డ్రామాలో కనిపించనున్నాడు. గతంలో వెంకీ తీసిన ‘సార్’ వంటి ఎమోషనల్ స్క్రిప్ట్‌లకు సూర్య వంటి నటుడి పెర్ఫామెన్స్ తోడైతే.. సినిమా స్థాయే మరో లెవెల్ లో ఉంటుందని అంచనా. ఈ కాంబినేషన్‌పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.

ఇప్పుడిది మరింత హైప్‌ను సృష్టిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సూర్య పాత్ర రెండు కోణాలతో ఉంటుంది. ఒకవైపు ఓ పాజిటివ్ యాంగిల్ చూపించగా.. మరోవైపు నెగిటివ్ షేడ్స్‌ కనిపించనున్నాయట. ప్రత్యేకమైన లుక్‌తో వెంకీ అట్లూరి సూర్యను డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది.

ఇదే యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలైట్ గా నిలవబోతోందట. సూర్య అభిమానులకు ఇది పక్కా విజువల్ ట్రీట్ కానుంది. ఇక మ్యూజిక్ పార్ట్‌లోనూ మంచి ఫోకస్ పెట్టారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇప్పటికే మ్యూజిక్ పనులు స్టార్ట్ చేశాడు. వెంకీ అట్లూరి సినిమాలకు జీవీ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఈ సినిమాకి కూడా మాస్ అండ్ ఎమోషనల్ ట్రాక్స్‌ను సిద్ధం చేస్తున్నాడట.

ఈ చిత్రంలో హీరోయిన్ గా మమిత బైజు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ నటి రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. 2025 చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు. సూర్య స్టైలిష్ లుక్, డ్యూయల్ షేడ్స్, ఎమోషనల్ టచ్‌తో వెంకీ అట్లూరి చెప్పబోయే కథ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.