హైదరాబాద్ కి సూర్య షిప్ట్ అవుతున్నాడా?
కోలీవుడ్ స్టార్ సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిగింది.
By: Tupaki Desk | 28 May 2025 12:33 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఇంత వరకూ రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్రీకరణకు రెడీ అవుతున్నారు. జూన్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదల వుతుందని సమాచారం. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్లు సిద్దం చేస్తున్నారు.
సూర్యకి ఇదే తొలి తెలుగు సినిమా కావడంతో ఆయనకు సెట్లో గ్రాండ్ గా వెల్కమ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. వెంకీ అట్లూరి సినిమా అంటే సెన్సిబుల్ అంశాలతోనే ఉంటుంది. భారీ పోరాట సన్ని వేశాలు లాంటివి ఉండవు. కాబట్టి ఇందులో సూర్యని యాక్షన్ స్టార్ గా ఊహించాల్సిన పనిలేదు. ఓ కొత్త కాన్సెప్ట్ లో మాత్రమే కనిపిస్తాడు. నటుడిగా సూర్య పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. అయితే చిత్రీకరణ నేపథ్యంలో సూర్య కొన్ని రోజుల పాటు హైదరాబాద్ కు షిప్ట్ అవుతున్నట్లు సమాచారం. నిర్మాతలు ఓ స్టార్ హోటల్ లో బస ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఆయన ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా కోసం ఎన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ఏది ఏమైనా మూడు నుంచి నాలుగు నెలలు షూటింగ్ తప్పనిసరి. ఈ క్రమంలో సూర్య ముంబై టై హైదరా బాద్ తిరగాల్సి ఉంటుంది. సూర్య హైదరాబాద్ కి తన సినిమా ప్రమోషన్ టైమ్ లోనే వస్తుంటారు. వచ్చినా? ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. ప్రచారంలో భాగంగా ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోవడం తప్ప రోజుల తరబడి ఉండే ఛాన్స్ ఇంత వరకూ రాలేదు. ఎలాగూ తెలుగు సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇదే సమయంలో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరవుతాడు.
