సూర్య- వెంకీ మూవీపై లేటెస్ట్ అప్డేట్
కోలీవుడ్ హీరో అయినప్పటికీ సూర్యకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు హీరోలకు సమానంగా సూర్యకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు.
By: Tupaki Desk | 20 April 2025 1:45 PM ISTకోలీవుడ్ హీరో అయినప్పటికీ సూర్యకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు హీరోలకు సమానంగా సూర్యకు తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే సూర్య తెలుగులో డైరెక్ట్ గా ఎప్పుడు మంచి మూవీ చేస్తాడా అని అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ టైమొచ్చినట్టు అనిపిస్తోంది.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానుందని ఎప్పట్నుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సూర్యకు వెంకీ ఓ కథ చెప్పి మెప్పించి, ఒప్పించి ఆఖరికి ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ భారీ బడ్జెట్ లో నిర్మించనున్న విషయం తెలిసిందే.
అయితే వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ఓ భారీ సెట్ ను వేయిస్తున్నారట. సెట్ వేయడానికి చాలానే టైమ్ పడుతుందని ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేస్తున్నారట. జూన్ నుంచి రెండు వారాల పాటూ జరగనున్న యాక్షన్ సీక్వెన్స్ లను ఈ సెట్ లోనే తెరకెక్కించనున్నాడట వెంకీ.
ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో జరగనున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవనున్నాయని చిత్ర యూనిట్ సభ్యులంటున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని ఈ సినిమాను వెంకీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించడం లేదట. సూర్య కు వెంకీ చెప్పిన కథ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
వెంకీ- సూర్య కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా ముందు భాగ్యశ్రీ బోర్సేను తీసుకుంటారని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు భాగ్యశ్రీ స్థానంలోకి కాయదు లోహర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సూర్యకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
