ఆ డైరెక్టర్‌తో సూర్య బ్లాక్ బస్టర్ కొడతాడా?
అంతే కాకుండా అతన్ని నమ్మి సూర్య మరో ఫ్లాప్‌ని ఎదుర్కోబోతున్నాడని వాపోతున్నారట.
By: Tupaki Desk | 14 May 2025 12:30 AMవిభిన్నమైన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ సూర్య. అదే స్థాయిలో రెండు భాషల్లోనూ మంచి మార్కెట్‌ని సొంతం చేసుకున్న సూర్య చాలా కాలంగా థియేట్రికల్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోలేకపోతున్నాడు. కరోనా టైమ్‌లో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా, 'జైభీమ్' సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలై బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. 'జై భీమ్' తృటిలో జాతీయ పురస్కారాన్ని కోల్పోయింది.
అయితే ఈ రెండు సినిమాల తరువాత సూర్య తన స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోలేకపోతున్నారు. కొత్తదనానికి ఎప్పుడూ పెద్దపీట వేసే సూర్య పాన్ ఇండియా సినిమా అంటూ శివ చెప్పిన కథని నమ్మి 'కంగువ' చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచి హీరో సూర్యకు ఊహించని షాక్ ఇచ్చింది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే కేవలం రూ.100 కోట్లకు మించి రాబట్టలేకపోయిందంటే 'కంగువ' ఏ స్థాయి డిజాస్టర్ గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ డిజాస్టర్ నుంచి కోలుకుని హిట్ అందుకోవాలని సూర్య చేసిన మరో మిస్టేక్ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్‌బెంచ్ ఫిలింస్‌తో కలిసి సూర్య నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదలై మళ్లీ సూర్యకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సూర్య 45 ప్రాజెక్ట్‌పై పడింది. ఈ మూవీతో సూర్య ఎలాగైనా బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుంటున్నాడట. దీనికి దర్శకుడు ఆర్.జె.బాలాజీ. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం బాలాజీ ఫేమస్ డైరెక్టర్ కాదు. భారీ బ్లాక్ బస్టర్లని అందించిన దర్శకుడు కాదు.
అలాంటప్పుడు సూర్య ఏ నమ్మకంతో ఆర్.జె.బాలాజీని నమ్మి సినిమా చేస్తున్నాడని కామెంట్‌లు చేస్తున్నారట. అంతే కాకుండా అతన్ని నమ్మి సూర్య మరో ఫ్లాప్‌ని ఎదుర్కోబోతున్నాడని వాపోతున్నారట. అయితే మరి కొంత మంది మాత్రం ఆర్.జె. బాలాజీ విషయమున్న దర్శకుడని, అతని టాలెంట్‌కు నిదర్శనమే నయనతారతో చేసిన 'ముకుతి అమ్మన్' అని, తను రూపొందిస్తున్న డివోషనల్ డ్రామాతో ఖచ్చితంగా సూర్యకు బ్లాక్ బస్టర్‌ని అందించడం ఖాయం అని చెబుతున్నారు. అంటే వారి అంచనా ప్రకారం రూటెడ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాతో సూర్య ఖచ్చితంగా బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నమాట.