రెట్రోలో అది మైనస్ అయ్యేలా ఉందే..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో చేసిన సినిమా రెట్రో.
By: Tupaki Desk | 26 April 2025 7:04 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో చేసిన సినిమా రెట్రో. సూర్య నటించడమే కాదు ఈ కథ మీద ఉన్న నమ్మకంతో సినిమాను నిర్మించాడు కూడా.. తన 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని నిర్మించిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. రెట్రో సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు.
మే 1న నాని హిట్ 3 కి పోటీగా సూర్య రెట్రో వస్తుంది. ఐతే సూర్య రెట్రో ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ కాగా ఈ ట్రైలర్ చూసిన తెలుగు ఆడియన్స్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే రెట్రో పక్కా కార్తీక్ సుబ్బరాజ్ సినిమాగా వస్తుంది కానీ అతని సినిమాల్లో ఉండే తమిళ నేటివిటీ ఈ సినిమాలో కూడా బాగా కనిపిస్తుంది. తమిళ్ వరకు ఇది బాగా వర్క్ అవుట్ అయినా మిగతా భాషల్లో మాత్రం కష్టమే అనిపిస్తుంది.
ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా రుచిస్తుందా లేదా అన్నది చెప్పడం కష్టమనిపిస్తుంది. వింటేజ్ సూర్య లుక్స్, యాక్షన్ పార్ట్ బాగున్నా ఎక్కువగా తమిళ నేటివిటీ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే సూర్య రెట్రో సినిమా తెలుగు ట్రైలర్ ఆశించిన రీచ్ అందుకోలేదు. సూర్య ని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ ఒకసారి చూసే ఛాన్స్ ఉన్నా కూడా ట్రైలర్ లో ఈ నేటివిటీ ఇష్యూ ఎక్కువగా కనిపించింది.
సూర్య మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. అందుకే అతని నుంచి వస్తున్న పర్ఫెక్ట్ మాస్ బొమ్మగా రెట్రో అదరగొట్టబోతుందని తెలుస్తుంది. ఐతే రెట్రో సినిమాకు ఎన్ని ప్లస్ లు ఉన్నాయో అన్ని మైనస్ లు ఉన్నాయన్నట్టు కనిపిస్తుంది. మరి రెట్రో సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్దే డీ గ్లామర్ రోల్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉందనిపిస్తుంది.
రెట్రో తెలుగు ప్రమోషన్స్ ఆల్రెడీ పూజా హెగ్దే మొదలు పెట్టింది. నేడు సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. విజయ్ దేవరకొండ గెస్ట్ గా వస్తున్న ఈ ఈవెంట్ పై అటు సూర్య ఫ్యాన్స్ తో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
