సూర్యకు కంగువ దెబ్బ గట్టిగా తగిలినట్టుందే!
ఈ మూవీ తరువాత ఆయన సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది.
By: Tupaki Desk | 21 April 2025 11:41 AM`గజిని` సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు సూర్య. ఈ మూవీ తరువాత ఆయన సినిమాలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సినిమాలు వుండటంతో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస ఏర్పడింది. ఎంతలా అంటే సూర్య సినిమా కోసం మాన తెలుగు ప్రేక్షకులు కూడా మన హీరోల మూవీస్ కోసం ఎదురు చూసేంత. అయితే ఈ ట్రెండ్‌కు బ్రేక్ పడింది. సూర్య భారీ స్థాయిలో చేసిన మూవీ `కంగువ`.
పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని సూర్యతో పాటు, నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పీరియాడిక్ ఫాంటసీ డ్రామాగా దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో సూర్య, మేకర్స్ షాక్‌కు గురయ్యారు. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ నష్టాలని మిగిల్చిన ఈ మూవీ తెలుగులో ఇప్పుడు సూర్య `రెట్రో`కు ప్రతిబంధకంగా మారింది.
కంగువ తెలుగు రైట్స్‌కి రూ. 22 కోట్లు లభిస్తే `రెట్రో`కు కేవలం పది కోట్లకు మాత్రం తీసుకోవడం గమనార్హం. `కంగువ` భారీ నష్టాలని తెచ్చిపెట్టడంతో సూర్య `రెట్రో`కు తెలుగులో ఏమాత్రం బజ్ వినిపించడం లేదు. తెలుగులో ఈ మూవీ రైట్స్‌ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. అయితే `కంగువ` ఫలితం మరోపక్క, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించిన `గేమ్ ఛేంజ్` ఫ్లాప్ పరోపక్క `రెట్రో`కు ఇబ్బందికరంగా మారినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించినా ఈ మూవీకి క్రేజ్‌ని తేలేకపోతోంది. తను క్రేజ్ కూడా తగ్గపోవడమే ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తిని రేకెత్తించకపోవడం, కథేంటో, సూర్య క్యారెక్టర్ ఏంటనే దానిపై ప్రేక్షకులకు స్ఫష్టత రాకపోవడం సినిమాపై హైప్‌ని క్రియేట్ చేయలేకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఇక `రెట్రో` రిలీజ్ రోజునే నాని `హిట్ 3` రిలీజ్ అవుతుండటం కూడా దీనికి ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడంతో అంతా నాని సినిమావైపే మొగ్గుచూపుతున్నారు. సూర్య `రెట్రో` గురించి ఎవ్వరు కూడా ఎంక్వైరీ చేయకపోవడంతో `కంగువ` ఫలితం ఎంత పని చేసింది? ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.