Begin typing your search above and press return to search.

ఐటెమ్ గా శ్రీయా వాళ్ల ప్లాన్ అదేనా..?

సూర్య కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తున్న రెట్రో సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   22 April 2025 11:30 PM
ఐటెమ్ గా శ్రీయా వాళ్ల ప్లాన్ అదేనా..?
X

సూర్య కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తున్న రెట్రో సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్య హీరోగా నటించడమే కాదు ఈ సినిమాకు నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నాడు. స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంది కాబట్టే సూర్య మంచి బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటించింది. సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ఇంప్రెస్ చేశాయి. కంగువతో మిస్సైనా సక్సెస్ ని రెట్రోతో కొట్టాలని చూస్తున్నాడు.

రెట్రో సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఈ సాంగ్ ని సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఐతే స్టార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఈమధ్య స్టార్ హీరోయిన్స్ చేస్తున్నారు. శ్రీయ కూడా మంచి హీరోయినే కానీ ఆమె ఆల్రెడీ అవుట్ డేటెడ్ అనే టాక్ ఉంది. కాస్త ట్రై చేస్తే ప్రస్తుతం స్టార్ స్టేటస్ లో ఉన్న ఏ హీరోయిన్ అయినా ఈ సాంగ్ చేసే అవకాశం ఉండేది.

అలా కాకుండా శ్రీయతోనే ఆ సాంగ్ చేయించడం వెనుక రీజన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఐతే శ్రీయ కి తమిళ్ లో ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ సూపర్ హిట్టైన చాలా సినిమా రీమేక్స్ లో శ్రీయ అక్కడ నటించింది. అదీగాక రెట్రోలో సూర్య వింటేజ్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ టైం లో అప్పటి స్టార్ హీరోయిన్ తో సాంగ్ ఉంటే బాగుంటుందని అలా ప్లాన్ చేసి ఉంటారని తెలుస్తుంది.

సూర్య శ్రీయ రెట్రో స్పెషల్ సాంగ్ మీద భారీ హైప్ పెంచుతున్నారు. ఐతే ఆ అంచనాలకు తగినట్టు సాంగ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే ఆడియన్స్ మాత్రం అదే సాంగ్ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ తో ఎవరితో అయినా చేయిస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా రెట్రో సినిమా సూర్య ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం తెచ్చింది. ట్రైలర్ కూడా కోలీవుడ్ లో సూపర్ హిట్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. మే 1న రాబోతున్న రెట్రో సూర్యకి సూపర్ హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.