Begin typing your search above and press return to search.

సూర్య 'రెట్రో'కు ప్రాఫిట్సా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 May 2025 7:30 PM
Retro Hit Or Flop
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అయింది.

అయితే స్టోరీ లైన్ బాగున్నా కార్తీక్ సుబ్బరాజ్ సరిగ్గా తీయలేదని చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. దీంతో మూవీ తెలుగు రాష్ట్రాల్లో తేలిపోయింది. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. కర్ణాటక, కేరళలో కూడా ఆశించినంత రిజల్ట్ సాధించలేకపోయింది. కేవలం తమిళంలోనే రెట్రో మూవీ మోస్తరు వసూళ్లు సాధిస్తోంది.

దీంతో రెట్రో మూవీ మేకర్స్ కు నష్టాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో సినిమాతో వచ్చిన లాభాల్లో సూర్య రూ.10 కోట్లు.. అగరం ఫౌండేషన్ కు దానం చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు ఇవేనని వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫౌండేషన్ ను పేద విద్యార్థుల కోసం సూర్యనే 2006లో మొదలుపెట్టారు.

వారికి ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా స్థాపించారు. పేద పిల్లల చదువు, గ్రామీణ ప్రజల ఆర్థిక భద్రత కోసం ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారు. అదే బాగానే ఉన్నా.. తమిళం తప్ప మిగతా భాషల్లో రెట్రో మూవీ డిజాస్టర్ గా మారితే లాభాలు ఎలా వచ్చాయని అంతా మాట్లాడుకుంటున్నారు.

డొనేట్ చేసే అంత లాభాలు వచ్చాయా అని అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెట్రో మూవీకి సూర్య నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా నిర్మాణానికి రూ.70 కోట్లు ఖర్చు అయిందని వార్తలు వస్తున్నాయి. మూవీ రిలీజ్ కు ముందే రెట్రో మేకర్స్.. సేఫ్ జోన్ లోకి వచ్చేశారని సమాచారం.

అందుకే సూర్య డొనేట్ చేసి ఉంటారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోవడం పక్కా అని చెబుతున్నారు. దీంతో సూర్య డొనేషన్ ఇచ్చారో లేదో తెలియదు కానీ.. ఆ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు.