సేఫ్ గేమ్ లో సూర్య గురి తప్పదుగా?
వర్సటైల్ యాక్టర్‌గానూ, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకునే నటుడిగానూ సూర్యకు ప్రత్యేక స్థానం ఉంది.
By: Tupaki Desk | 22 April 2025 12:05 PM ISTవర్సటైల్ యాక్టర్‌గానూ, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకునే నటుడిగానూ సూర్యకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా మంచి కథలతోనే సినిమాలు చేసినా, ఆయనకు బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఎన్జీకే, కాప్పాన్, సింగం 3, 24, ET వంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. సురారై పొట్రూ మంచి గుర్తింపు అందుకుంది కానీ అది ఓటీటీలో విడుదలైంది.
ఇక చివరగా వచ్చిన కంగువా 1000 కోట్లు కొడుతుంది అని నమ్మకంతో ఉన్న సూర్యకు నిరాశే మిగిలింది. ఒకవైపు నటుడిగా మెప్పిస్తూ, మరోవైపు కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు, ఇప్పుడు రెట్రో అనే సినిమా కొత్త ఆశలు నింపుతోంది. సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెట్రో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్ తన స్టైల్‌తోనే సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సెట్ చేసుకున్నాడు. అతడి సినిమాల్లో సాంకేతికంగా కొత్తదనం, కథలో ట్విస్టులు ఉంటాయి.
అటువంటి దర్శకుడి సినిమాలో సూర్య నటిస్తుండటం ఆయనకు కొత్త శక్తి నిచ్చే అంశంగా మారింది. ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే పెద్ద సినిమానే కనిపించినా కంటెంట్ కు అవజ్రామయ్యే లిమిటెడ్ బడ్జెట్ లోనే తెరకెక్కిందట. సుమారు రూ.65 కోట్లు మాత్రమే ఖర్చుతో రూపొందిన ఈ సినిమా, పెద్ద ప్రాజెక్టులకు ఉండే టెన్షన్ లేకుండా చేసింది.
కంగువ లాంటి భారీ సినిమాతో ఉన్న ప్రెజర్‌ను చూసిన తరువాత, ‘‘రెట్రో’’ నిర్మాణంలో తీసుకున్న స్ట్రాటజీ సరికొత్తగా ఉందనే చెప్పాలి. బడ్జెట్ పరంగా భారం తక్కువగా ఉండటం వల్ల చిన్న హిట్టుతోనైనా బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు మంచి స్పందన తెచ్చుకున్నాయి. అందులో చూపిన విజువల్స్, సూర్య లుక్, మ్యూజిక్ అన్నీ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, సమ్మర్ సీజన్ బెనిఫిట్‌ను బాగా వాడుకునేలా కనిపిస్తోంది. సూర్య అభిమానులు ఈసారి అయినా థియేటర్లలో తమ హీరో విజయం సాధిస్తాడని నమ్ముతున్నారు. ‘జై భీమ్, సూరరై పోట్రు వంటి సినిమాలు ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ కారణంగా థియేటర్‌లో మంచి హిట్ కోసం సూర్య చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ‘‘రెట్రో’’ సక్సెస్ కు సరైన టైమ్ సెట్టయ్యింది. కంటెంట్ కథ, ట్రీట్‌మెంట్, ఎమోషన్ అన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, ఇది సూర్యకు తిరుగు లేని కమ్‌బ్యాక్ అవుతుందని అనిపిస్తోంది. మరి ఈసారి అతడి అదృష్టం ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి.
