Begin typing your search above and press return to search.

సూర్యని డైరెక్ట్ చేయాల్సిన త్రివిక్రమ్ ఇలా నిర్మాతగా..?

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోన్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 7:00 AM IST
సూర్యని డైరెక్ట్ చేయాల్సిన త్రివిక్రమ్ ఇలా నిర్మాతగా..?
X

కోలీవుడ్ స్టార్ సూర్య ఈమధ్యనే రెట్రోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. సినిమాపై ఉన్న అంచనాలను అందుకోలేదు కానీ తమిళ్ లో కాస్త పర్వలేదు అన్నట్టుగా వసూళ్లు రాబట్టింది. ఐతే సూర్య రెట్రో ఈవెంట్ లో తెలుగు సినిమాను ప్రకటించాడు. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లింది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోన్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సూర్య సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. ఎమధ్యనే ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరపగా సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారని తెలుస్తుంది. సూర్య హీరోగా చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసిందే. ఐతే సూర్య తెలుగులో సినిమా చేస్తే అది త్రివిక్రం డైరెక్షన్ లోనే చేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాడు.

సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ తో చాలామంది ఆయన్ను డైరెక్ట్ తెలుగు సినిమా చేయమని అడిగారు. ఐతే సూర్య మాత్రం త్రివిక్రం తో చేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ తర్వాత బోయపాటి శ్రీను లాంటి వారితో కూడా ప్రయత్నాలు చేశారు. అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఐతే సూర్య త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అనుకుంటే త్రివిక్రం నిర్మాతగా మారి చేస్తున్న సినిమాలో అతను నటించాల్సి వచ్చింది. వెంకీ కూడా తన డైరెక్షన్ టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్నాడు.

సార్ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి సర్ ప్రైజ్ హిట్ కొట్టాడు. లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చాలా సీక్రెట్ గా ఉంచారు. అదే తరహాలో సూర్య సినిమాను కూడా పూర్తయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారట. సూర్య వెంకీ అల్టూరి ఈ కాంబో సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ని అలరిస్తుందని అంటున్నారు. కొన్నాళ్లుగా సూర్య తన మార్క్ హిట్ కొట్టలేకపోతున్నాడు. కంగువ, రెట్రో తెలుగులో నిరాశపరిచాయి. వెంకీ అట్లూరి తో చేస్తున్న సినిమా అయినా వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. త్రివిక్రం ప్రస్తుతానికి సూర్య సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా రాబోయే రోజుల్లో త్రివిక్రం డైరెక్షన్ లో సూర్య సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పొచ్చు.