Begin typing your search above and press return to search.

సూర్య సినిమాలు.. ఒక్కొక్కటి మిస్ అవుతున్నాయా?

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో సూర్య మూవీస్ కోసం చర్చ నడుస్తోంది. సినిమాలను ఫిక్స్ చేసే ప్రక్రియలో.. చేతులోకి వచ్చిన కొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులను సూర్య మిస్ అవుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 3:30 PM
సూర్య సినిమాలు.. ఒక్కొక్కటి మిస్ అవుతున్నాయా?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. వాటిని పూర్తి చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. కానీ సరైన హిట్స్ ను సొంతం చేసుకోలేకపోతున్నారు. ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. భారీ అంచనాలతో సినిమాలు విడుదల అవుతున్నా.. బోల్తా కొడుతూనే ఉన్నాయి.

ఇటీవల ఆయన నటించిన కంగువా, రెట్రో సినిమాలు.. కచ్చితంగా హిట్ అవుతాయని అటు సూర్య.. ఇటు మేకర్స్ అనుకున్నారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. కంగువా అయితే రూ.2000 కోట్లు వస్తాయని నిర్మాతలు అన్నారు. సగం కూడా రాలేదు. రెట్రోకి లాభాలు వచ్చాయని టాక్ వచ్చినా అది నిజం మాత్రం కాదు.

ఇప్పుడు సూర్య సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో వర్క్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. రీసెంట్ గా సూర్య, వెంకీ అట్లూరి పళని టెంపుల్ కు వెళ్లారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. సినిమా కచ్చితంగా భారీ హిట్ అవ్వాలని మురుగన్ ను సూర్య మొక్కుకున్నారేమో మరి!

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో సూర్య మూవీస్ కోసం చర్చ నడుస్తోంది. సినిమాలను ఫిక్స్ చేసే ప్రక్రియలో.. చేతులోకి వచ్చిన కొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులను సూర్య మిస్ అవుతున్నారని అంటున్నారు. అది కొంతవరకు కరెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ సినిమాల రిలీజ్ తర్వాత పలు ప్రాజెక్టుల్లో నుంచి సూర్యను తప్పించినట్లు టాక్ వినిపిస్తోంది.

మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా సూర్య.. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేశారు. మూడు పార్టుల్లో తీస్తారని అప్పుడు టాక్ వచ్చింది. కానీ కంగువా రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏమైందో కూడా తెలియలేదు. పలు ఇష్యూల వల్ల సినిమా ఆగిపోయిందని కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.

ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న పరాశక్తి మూవీలో లీడ్ రోల్ సూర్యనే పోషించాల్సింది. కానీ ఇప్పుడు శివ కార్తికేయన్ నటిస్తున్నారు. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా సూర్యతో సూపర్ హీరో మూవీ చేయాలని ప్లాన్ వేసినట్లు వినిపించింది. కానీ ఇప్పుడు ఆయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో ప్లాన్ చేస్తున్నారట.

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ తో సూర్య ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అందులో సూర్య బదులు స్టార్ హీరో శింబు లీడ్ రోల్ లో నటించనున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇవన్నీ విని సూర్య ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను తమ హీరో మిస్ అవుతున్నారని అంటున్నారు. సెలక్షన్ పై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.