సూర్య 'కరుప్పు'.. టీజర్ ఎలా ఉందో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా మూవీల షూటింగ్స్ లో పాల్గొంటూ.. మంచి హిట్స్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
By: Tupaki Desk | 23 July 2025 11:06 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా మూవీల షూటింగ్స్ లో పాల్గొంటూ.. మంచి హిట్స్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తున్న సినిమాల్లో కరుప్పు ఒకటి. మల్టీ టాలెంటెడ్ ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.
19 ఏళ్ల తర్వాత సూర్యతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. నేడు (జూలై 23న) సూర్య పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ముందుగా పోస్టర్ చూసుకుంటే.. సూర్య నలుపు దుస్తుల్లో కనిపించారు. తనదైన స్టైల్ లో నడుస్తూ అంచనాలు పెంచుతున్నారు. మరో పోస్టర్లో ఓ భారీ విగ్రహం, త్రిశూలాలు, ఆయుధాలతో కూడిన గర్భగుడి వంటివి ఎలిమెంట్స్ ను చూపించి సినిమాపై క్యూరియాసిటీ కలిగేలా చేశారు మేకర్స్. ఇప్పుడు టీజర్ ఎలా ఉందో ఉందంటే..
"కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై వచ్చే దేవుడు" అంటూ వచ్చిన బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో టీజర్ పవర్ ఫుల్ గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత సూర్య కత్తి పట్టుకుని షాడోలో కనిపించారు. మరో షాట్ లో రిలాక్ట్ డ్ ఉన్నారు. ఇంకో షాట్ లో లాయర్ గా దర్శనమిచ్చారు.
"నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరు.." అంటూ సందడి చేశారు. వివిధ పాత్రల్లో కనిపించిన సూర్య.. యాక్షన్ సీన్స్ తో అదరగొట్టారు. ఒక్కో సన్నివేశంలో వింటేజ్ మోడ్ లో కనిపించారు. సినిమాలో డ్యుయల్ రోల్ లో నటిస్తున్నట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. ఓవరాల్ గా సూర్య ఫ్యాన్స్ కు మాత్రం టీజర్ ఫుల్ మీల్స్ లా ఉందని చెప్పాలి.
టీజర్ కు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉంది. ప్రతి సీన్ కు కరెక్ట్ గా సరిపోయింది. ఇది నా టైమ్ అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి సూర్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్.. అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది. గ్లింప్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బర్త్ డే విషెస్ కూడా చెబుతున్నారు.
