దర్శకుడికి ఇచ్చిన మాటపై సూర్య నిలబడతాడా?
తమిళ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ చిత్రం రెట్రో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 6 May 2025 9:31 AM ISTతమిళ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ చిత్రం రెట్రో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య గత సినిమా కంగువా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినా రెట్రో సినిమాపై ఆయన ఫ్యాన్స్‌లో నమ్మకం కలిగింది. అందుకు కారణం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడం అనే విషయం తెలిసిందే. రెట్రో సినిమా రిలీజ్ టైమ్ లో ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అన్ని అంచనాలతో వచ్చిన రెట్రో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తమిళనాడుతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ రెట్రో సినిమాకు నిరాశే మిగిలింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసిన మేకర్స్ కి పెద్ద షాక్ తగిలింది. కంగువ స్థాయిలో కూడా రెట్రో ఓపెనింగ్స్ నమోదు కాలేదు.
రెట్రో సినిమా ప్రమోషన్ సమయంలో సూర్య మాట్లాడుతూ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్, అతడి వర్కింగ్ స్టైల్ బాగుంటుందని ప్రశంసలు కురిపించాడు. అతడు కథలను ఎంపిక చేసే విధానం గురించి కూడా ప్రముఖంగా సూర్య కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో కార్తీక్ సుబ్బరాజ్‌తో త్వరలోనే మళ్లీ వర్క్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒక స్టేజ్ మీద కార్తీక్ సుబ్బరాజ్‌కి హీరో సూర్య హామీ ఇచ్చాడు. ఇద్దరం కలిసి మరోసారి వర్క్ చేద్దాం, ఆ సినిమాను ఈ సినిమా కంటే గొప్పగా చేద్దాం అన్నట్లుగా సూర్య చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
కట్ చేస్తే రెట్రో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అసలు ఇలాంటి సినిమాను సూర్య ఎలా కమిట్ అయ్యాడు, కథ విన్నాడా లేదా.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఏం చెప్పాడో అదే తీసి ఉంటాడా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ ఒక్క సినిమా విషయంలోనే కాకుండా ఇతర సినిమాల విషయంలోనూ ఆయా హీరోలను వారి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు. అందుకే ముందు ముందు ఆయనతో స్టార్ హీరోలు వర్క్ చేసేందుకు ధైర్యం చేస్తారా అంటే అనుమానమే అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఇప్పటికే మరోసారి కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. ఇప్పటికీ ఆ మాట మీద ఉంటాడా అనేది చూడాలి.
కార్తీక్ సుబ్బరాజ్ ఇంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రూపొందించిన పేటా సినిమా కూడా నిరాశ పరచింది. కొన్ని చిన్న సినిమాలు, మీడియం రేంజ్ పర్వాలేదు అనిపించుకున్నాయి. ఎక్కువ శాతం సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. రెట్రోకి ముందు జిగర్తండా డబుల్‌ఎక్స్ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో సూర్య డేట్లు ఇచ్చి ఉంటాడు. అంతకు ముందు వచ్చిన మహాన్ సినిమా సైతం యావరేజ్‌గానే నిలిచింది. అందుకే దర్శకుడిపై మెల్ల మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రజనీకాంత్‌తో కార్తీక్ సుబ్బరాజ్ మరో సినిమా ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆ సినిమా ఉందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. సూర్య మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్‌తో సినిమా చేస్తాడా.. లేదా.. అనే విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది.
