బ్రదర్స్ సినిమాలను ఎవరు కొనట్లేదా?
అదే పరిస్థితి కార్తి సినిమాలకూ వచ్చింది. ఆయన నటించిన సర్దార్ 2 కూడా ఈ దీపావళికి బరిలోకి వస్తుందని అనుకున్నారు. ఇది సీక్వెల్ కావడంతో బజ్ కూడా బాగానే ఉంది.
By: Tupaki Desk | 20 Aug 2025 9:00 AM ISTకొన్ని సంవత్సరాలుగా కంటెంట్ డ్రివెన్ మూవీస్ తో అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న సూర్య, కార్తి అన్నదమ్ములు ఇప్పుడు ఓటిటి సమస్యలతో సతమతమవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈమధ్య బిగ్ హిట్ దక్కకపోయినా, వీరి సినిమాలపై ఎప్పటికప్పుడు మంచి బజ్ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఓటిటి డీల్స్ సరిగా కుదరకపోవడంతో కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.
సూర్య నటించిన కరుప్పు మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. షూటింగ్ పూర్తయినా, ఇంకా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయలేదు. కారణం ఓటిటి డీల్. ఈ సినిమాకు సంబంధించి పలువురు ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ తో చర్చలు జరిపినా, మేకర్స్ అంచనాలకు తగ్గ రేంజ్ లో డీల్ జరగలేదు. దీంతో సినిమా రిలీజ్ ఇప్పటికీ స్పష్టత రాలేదు.
అదే పరిస్థితి కార్తి సినిమాలకూ వచ్చింది. ఆయన నటించిన సర్దార్ 2 కూడా ఈ దీపావళికి బరిలోకి వస్తుందని అనుకున్నారు. ఇది సీక్వెల్ కావడంతో బజ్ కూడా బాగానే ఉంది. షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఓటిటి డీల్ కుదరకపోవడంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. సీక్వెల్ సినిమాలకి సాధారణంగా మంచి డిమాండ్ ఉండేలా ఉంటుంది కానీ ఈసారి మాత్రం పరిస్థితి తారుమారయింది.
ఓటిటి సమస్యలతో కార్తి మరో సినిమా 'వా వాథియర్' కూడా హోల్డ్ లోనే ఉంది. ఈ చిత్రానికి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా తోడయ్యాయి. అంటే సూర్య, కార్తి ఇద్దరి సినిమాలూ ఒకే సమయంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. రిలీజ్ కి వస్తే కానీ, నాన్ థియేట్రికల్ బిజినెస్ రాకపోవడంతో మేకర్స్ కంగారు పడుతున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ చాలా తక్కువ రేంజ్ లో ఆఫర్స్ చేస్తున్నాయట. మేకర్స్ అంచనాలకు చాలా దూరంగా ఉండటంతో డీల్స్ కుదరడం లేదు. ఇప్పుడు ఈ సినిమాలు థియేట్రికల్ గా ఎప్పుడు రిలీజ్ అవుతాయో అన్నది స్పష్టత లేని పరిస్థితి. ఈ రెండు సినిమాలూ దీపావళి రిలీజ్ కోసం సిద్ధమై ఉన్నా, ఓటిటి డీల్స్ లేకుండా థియేట్రికల్ ప్లాన్స్ ముందుకు సాగడం కష్టం.
మొత్తానికి సూర్య, కార్తి కొత్త సినిమాలు రెండూ ఓటిటి సమస్యలతో ఆగిపోవడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయం. ఈ సమస్య త్వరగా సాల్వ్ అవుతుందేమో చూడాలి. లేదంటే దీపావళికి ప్లాన్ చేసిన రిలీజ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. సూర్య, కార్తి లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనడం చూస్తుంటే అంతకంటే బజ్ తక్కువగా ఉన్న సినిమాల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
