సూర్య 600కోట్ల బడ్జెట్ మూవీ కొన్ని గంటల్లో ప్రకటన?
సౌత్ స్టార్ హీరో సూర్యను బాలీవుడ్ కి పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకనిర్మాత రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా `కర్ణ` అనే భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారమవుతోంది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:51 PM ISTసౌత్ స్టార్ హీరో సూర్యను బాలీవుడ్ కి పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకనిర్మాత రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా `కర్ణ` అనే భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారమవుతోంది. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని కథనాలొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రజెక్ట్. రాకేష్ లాంటి పేరున్న దర్శకుడు తన సినిమాని పట్టాలెక్కించాలనుకున్నా, బడ్జెట్ పెద్ద అడ్డంకిగా మారిందని కథనాలొచ్చాయి. ఇప్పుడు మరో రెండు నిర్మాణ సంస్థలను కలుపుకుని ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. జియో స్టూడియోస్ - అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్లను రాకేష్ సంప్రదించి ఒప్పించాడు. అలాగే జంగ్లీ పిక్చర్స్ కూడా ఈ ప్రాజెక్టులో చేరుతుందని తెలిసింది. అయితే దీనిని ఇంకా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
మరో 24 గంటల్లోనే దీనికి సంబంధించిన సస్పెన్స్ మిస్టరీ వీడనుందని కూడా కథనాలొస్తున్నాయి. అయితే స్టార్ హీరో సూర్య సోలో హీరోగా మొదటి హిందీ చిత్రాన్ని రూపొందించాలని రాకేష్ లక్ష్యంగా పెట్టుకుని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా వెంటనే పట్టాలెక్కుతుందా లేదా? అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.
అయితే కర్ణ ఫ్రాంఛైజీలో ఒక్కో భాగం తెరకెక్కడానికి 300 కోట్లు ఖర్చు చేస్తే, సూర్య సినిమా కనీస మొత్తంగా థియేట్రికల్ రిలీజ్ నుంచి 320 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంటుంది. రెండు సినిమాలకు కలుపుకుని అతడు సుమారు 700 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కంటెంట్ బావుంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ కి సమస్య ఉండకపోవచ్చు. పాన్ ఇండియా ట్రెండ్ లో కంటెంట్ బావుంటే, ప్రజలకు నచ్చితే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ స్టార్లు సైతం బోల్తా కొడుతున్నారు. అందువల్ల సూర్యను అంత పెద్ద బడ్జెట్ సినిమాలతో హిందీ చిత్రసీమకు పరిచయం చేయడం అంటే సవాల్ తో కూడుకున్నది. కానీ రాకేష్ పట్టుదలగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఇది మహాభారతంలో కర్ణుడి కథ ఆధారంగా రూపొందుతోందా లేదా? అన్నదానికి రాకేష్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
