సూర్య రెట్రో మీద సితార హ్యూజ్ బెట్..?
రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సాలీడ్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు.
By: Tupaki Desk | 18 April 2025 4:30 PM`కంగువ` మూవీతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న హీరో సూర్య దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ `రెట్రో` మూవీపై పెట్టుకున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య నిర్మించారు. సూర్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సాలీడ్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. తెలుగులో ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రైట్స్ కోసం రూ. 9 కోట్లు వెచ్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి మించి తెలుగు మార్కెట్ నుంచి రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్‌గా సెన్సార్ పూర్తయింది. యు/ఏ సర్టిఫికెట్ లభించింది. 2 గంటల 48 నిమిషాల రన్‌టైమ్‌ని లాక్ చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ అందించిన `గేమ్ ఛేంజర్` ఫ్లాప్ కావడం, సూర్య నటించిన పీరియాడిక్ డ్రామా `కంగువ` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ కావడంతో `రెట్రో`తో సితార సాహసం చేస్తోందని, ఒకరకంగా చెప్పాలంటే సితార `రెట్రో`తో తెలుగులో హ్యాజ్ బెట్‌కు రెడీ అవుతోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ లెక్కలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. `రెట్రో` టీజర్, ఐదు రోజుల క్రితం విడుదల చేసిన `ది వన్ రెట్రో` సినిమాపై అంచనాల్ని పెంచేయడంతో సితార వంశీ ఈ మూవీపై ఫుల్‌కాన్ఫిడెంట్‌తో ఉన్నాడట. ఈ సారి `రెట్రో`తో సూర్య భారీ హిట్‌ని సొంతం చేసుకోబోతున్నాడని బలంగా నమ్ముతున్నాడట. తెలుగులో పెట్టిన పెట్టుబడికి మించి రాబడుతుందనే గట్టి నమ్మకంతో వంశీ ఉన్నారట. ఆయన నమ్మకాన్ని `రెట్రో ఎంత వరకు నిలబెడుతుందో తెలియాలంటే మే 1 వరకు వేచి చూడాల్సిందే.