యాక్టింగ్ టఫ్, ప్రొడ్యూసింగ్ ఈజీ.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్..!
కోలీవుడ్ స్టార్ సూర్య తన మార్క్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. చేసేది తమిళ సినిమాలే అయినా కూడా తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు.
By: Tupaki Desk | 28 April 2025 5:00 AM ISTకోలీవుడ్ స్టార్ సూర్య తన మార్క్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. చేసేది తమిళ సినిమాలే అయినా కూడా తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. గజిని సినిమా నుంచి సూపర్ అంటే తెలుగు ఆడియన్స్ లో కూడా ఒక మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే తన ప్రతి సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా వదులుతుంటాడు. ఐతే సూర్య తను సినిమాల్లో నటించడమే కాదు తన సొంత ప్రొడక్షన్ లో సినిమాలను నిర్మిస్తున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలను నిర్మిస్తున్నాడు.
ఇప్పటివరకు ఆ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీటిలో సూర్యనే నటించాడు. తన అభిరుచికి తగినట్టుగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సూర్య కి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటి అంటే సూర్యకి యాక్టింగ్, ప్రొడ్యూసింగ్ ఈ రెండిటిలో ఏది ఈజీ, ఏది టఫ్ అనిపిస్తుంది అని అడిగారు. దానికి ఆన్సర్ గా సూర్య యాక్టింగ్ టఫ్ ప్రొడ్యూసింగ్ ఈజీ అని ఆన్సర్ ఇచ్చాడు.
సూర్య లాంటి యాక్టర్ అలా చెప్పడం కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. కానీ అతని చెప్పిన దానిలో ఇన్నర్ మీనింగ్ ఏంటంటే సూర్య యాక్టింగ్ చేయడం రిస్క్ తో కూడిన పని అలా కాకుండా ప్రొడ్యూసర్ గా చేస్తే ఇబ్బంది ఉండదని అని చెప్పుకొచ్చాడు. కానీ నిజం చెప్పాలంటే యాక్టింగే ఈజీ, ప్రొడ్యూసర్ గా చేయడమే హార్డ్ అని అందరు అంటారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది ఒక పెద్ద బాధ్యత. సినిమాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రొడ్యూసర్ అనే వాడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.
కానీ సూర్య మాత్రం అదే ఈజీ నటించడమే టఫ్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఏది ఏమైనా సూర్య ఆలోచనల్లో నిర్మాతగా తను కేవలం పార్ట్ టైం గానే కాదు ఫుల్ టైం గా కూడా కొనసాగే ఛాన్స్ ఉందని అర్ధమవుతుంది. తప్పకుండా సూర్య డిఫరెంట్ కథలతో ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చే సినిమాలు చేస్తారని చెప్పొచ్చు. సూర్య కూడా నిర్మాతగా ఎవరు టచ్ చేయని కథలను తెర మీద చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అతని నిర్మాణంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి.
