Begin typing your search above and press return to search.

45 కంటే 46పైనే అంచ‌నాల‌న్నీ!

దీంతో సూర్య 45వ చిత్రం కంటే 46వ చిత్రంపై హైప్ క్రియేట్ అవుతుంది. సూర్య సైతం ఈ సినిమాపై కాన్పిడెంట్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   6 Jun 2025 8:43 PM IST
45 కంటే 46పైనే అంచ‌నాల‌న్నీ!
X

కోలీవుడ్ స్టార్ సూర్య‌కి కొంత కాలంగా స‌రైన స‌క్స‌స్ లు ప‌డ‌లేదు. పాన్ ఇండియాలో భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన `కంగువ` తీవ్ర నిరుత్సాహ‌న్ని మిగిల్చింది. ఈ సినిమా ఫ‌లితం సూర్య‌కి ఓ షాకింగ్ లాంటింది. ఎంతో న‌మ్మి చేసిన ప్రాజెక్ట్ ఊహించ‌ని ఫ‌లితాన్నిచ్చింది. ఆ షాక్ నుంచి పూర్తిగా తేరుకో కుండానే రెట్రో రూపంలో మ‌రో ట్విస్ట్ ఎదురైంది. ఈ సినిమా అయినా క‌మ‌ర్శియ‌ల్ గా గ‌ట్టెక్కిస్తుం దనుకుంటే రెట్రో కూడా డిజాస్ట‌ర్ గా నమోదైంది.

`రెట్రో` సెట్స్ లో ఉండ‌గానే 45వ చిత్రంగా ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించారు. బాలాజీ కూడా ద‌ర్శ‌కుడిగా ఎక్స్ ప‌ర్ట్ కాదు. స్టోరీ పై కాన్పిడెన్స్ తో ముందుకెళ్తున్నారు. ఇదే స‌మ‌యంలో సూర్య 46వ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ కూడా షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. వెంకీ అట్లూరీ ప్రాజెక్ట్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. తాజాగా ఆ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈనెల 9 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

ఈ సినిమాపై మాత్రం అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడిగా వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డు బాగుంది. ప‌రిమిత బ‌డ్జెట్ లోనే భారీ వ‌సూళ్ల చిత్రాలు అందించాడు. గ‌త సినిమా `ల‌క్కీ భాస్క‌ర్` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. దీంతో సూర్య 45వ చిత్రం కంటే 46వ చిత్రంపై హైప్ క్రియేట్ అవుతుంది. సూర్య సైతం ఈ సినిమాపై కాన్పిడెంట్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. సూర్యకి స‌క్స‌స్ కూడా అంతే కీల‌కం.

వ‌రుస ప‌రాజ‌యాలు మార్కెట్ పై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇప్ప‌టికే సూర్య తెలుగు మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉంది. మునుప‌టి అంత క్రేజ్ క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సూర్య తెలుగులో ఆల‌స్యం చేయ‌కుండా స్ట్రెయిట్ చిత్రానికి తెర తీసాడు. ఈ సినిమా స‌క్సెస్ అయితే త‌దుప‌రి సూర్య మ‌రిన్ని తెలుగు సినిమాలు చేసే అవ‌కాశం ఉంది.