Begin typing your search above and press return to search.

సూప‌ర్ హీరో చిత్రం స‌ర్ ప్రైజ్ షురూ!

అయితే మూడ‌వ భాగం రిలీజ్ అయి ద‌శాబ్ధం చేరువైనా ఇంత‌వ‌ర‌కూ 'క్రిష్-4' ప‌ట్టాలెక్కింది లేదు.

By:  Tupaki Desk   |   27 March 2024 9:42 AM GMT
సూప‌ర్ హీరో చిత్రం స‌ర్ ప్రైజ్ షురూ!
X

'క్రిష్ 'ప్రాంచైజీ స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తండ్రి త‌న‌యులు రాకేష్ రోష‌న్- హృతిక్ రోష‌న్ ఈ ప్రాంజైచీలో అద్భుత‌మైన స‌క్సెస్ సాధించారు. సూప‌ర్ హీరోల చిత్రాల్లో న్యూ ట్రెండ్ని ప‌రిచ‌యం చేసిన ద్వ‌యం అది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మూడు భాగాలు భారీ విజ‌యం సాధించాయి. అయితే మూడ‌వ భాగం రిలీజ్ అయి ద‌శాబ్ధం చేరువైనా ఇంత‌వ‌ర‌కూ 'క్రిష్-4' ప‌ట్టాలెక్కింది లేదు. థ‌ర్డ్ పార్ట్ రిలీజ్అయిన రెండేళ్ల నుంచి క్రిష్-4 గురించి నెట్టింట ప్ర‌చారం త‌ప్ప‌! అస‌లు సంగతేంటి? అన్న‌ది క్లారిటీ లేదు.


ప‌లు సంద‌ర్భాల్లో 'క్రిష్-4' గురించి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. హీరోయిన్ గా మాత్రం మ‌ళ్లీ ప్రియాంక చోప్రానే క‌న్ప‌మ్ చేస్తూ రాకేష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించేసారు. హీరోగా య‌ధావిధిగా హృతిక్ రోష‌న్ కొన‌సాగుతాడు. మ‌రి సినిమా ప్రారంభ‌మ‌య్యేది ఎప్పుడు? ప్ర‌స్తుతం 'క్రిష్‌-4' ఏ స్టేజ్ లో ఉంది? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో క్రిష్‌-4కి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొద‌లు కానున్నాయ‌ని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇప్ప‌టికే స్టోరీ కి సంబంధించిన ప‌నుల్లో త‌మ ర‌చ‌యితల‌ బృందంగా బిజీగా ఉందని..రేయింబ‌వ‌ళ్లు అదే ప‌నిలో ఉన్న‌ట్ల తెలిపారు. మునుప‌టి మూడు భాగాల కంటే చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మకంగా భావించ‌డంతో టీమ్ ర‌చ‌యిత‌ల బృందం తీవ్రంగా శ్ర‌మిస్తుంద‌ని పేర్కొన్నారు. ఏడాది చివ‌ర్లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారం భించి 2025 ఏడాదిలో చిత్ర ప్రారంభోత్స‌వం జ‌ర‌పాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం హృతిక్ రోష‌న్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూ స్తున్నాడ‌ని...ఇక ఆస‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్లే న‌ని రాకేష్ రోష‌న్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్ వార్ -2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా త‌ర్వాత హృతిక్ రోష‌న్ క్రిష్‌-4 షూట్ లోనే పాల్గొంటారు. వార్ -2 త‌ర్వాత మ‌రే ప్రాజెక్ట్ కి ఆయ‌న క‌మిట్ అవ్వ‌లేదు. హృతిక్ నుంచి కూడా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది చాలా రేర్. కొంత కాలంగా ఆయ‌న నుంచి ఏడాదికి ఒక సినిమానే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో హృతిక్ త‌దుప‌రి ప్రాజెక్ట్ క్రిష్‌-4 అని తెలుస్తుంది.