Begin typing your search above and press return to search.

మల్టీస్టారర్​గా మరో భారీ గ్యాంగ్​స్టర్​ మూవీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరరై పొట్రు' ఇండియావైడ్​గా ఎంతటి సెన్సేషన్​ అయిందే తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   21 Aug 2023 5:22 AM GMT
మల్టీస్టారర్​గా మరో భారీ గ్యాంగ్​స్టర్​ మూవీ
X

దర్శకురాలు సుధ కొంగర డైరెక్షన్​లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరరై పొట్రు' ఇండియావైడ్​గా ఎంతటి సెన్సేషన్​ అయిందే తెలిసిన విషయమే. 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులోనూ విడుదలై విశేష ప్రజాదరణను అందుకుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డైరెక్టర్ సుధ కొంగర ఈ సారి మల్టీస్టారర్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ మూవీకోసం సుధ కొంగర మళ్లీ సూర్యతో కలిసి పనిచేయనున్నారు. మలయాళ స్టార్​ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉందులో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను ఓ ప్రముఖ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సూర్య భారీ పీరియాడిక్ డ్రామా కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తవ్వగానే డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్టులో జాయిన్ అవతారని తెలిసింది.

సూర్య 43 వర్కింగ్​ టైటిల్​తో ఈ మల్టీస్టారర్​ రానుంది. ఈ చిత్రంలోనే దుల్కర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్యాంగస్టర్​ థ్రిల్లర్​గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్​ జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతం అందించనున్నారట. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ఫ్యాన్స్​.. సోషల్​మీడియాలో ఈ సినిమా గురించి ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. మల్టీస్టారర్​ గ్యాంగస్టర్​గా రాబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి.

ఈ సినిమా గురించి సుధ కొంగర మాట్లాడుతూ.. "నా తర్వాతి​ ప్రాజెక్ట్ 'సూరరై పొట్రు' కన్నా ఎక్కువ ఛాలెంజింగ్​గా ఉండనుంది. భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నాం. ఇది బయోపిక్​ కాదు. ఇది నా ప్యాషన్ ప్రాజెక్ట్​. సూర్య కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు" అని చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.

ఇక సూర్య విషయానికొస్తే ఆయన లైనప్ భారీగా ఉంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్​లో కంగువ చిత్రం చేస్తున్నారు. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్'​ రోలెక్స్​ బెస్​తో రానున్న సినిమాలో నటించనున్నారు. ఇక దుల్కర్ సల్మాన్​.. తాజాగా గన్స్ అండ్ గులాబ్స్​ అనే సిరీస్​తో ఆడియెన్స్​ ముందుకు వచ్చారు. మరో వారంలో 'కింగ్స్​ ఆఫ్ కోత' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది కూడా గ్యాంగ్​స్టర్ క్రైమ్​ డ్రామా నేపథ్యంలో రూపొందింది.