Begin typing your search above and press return to search.

బౌన్స్ బ్యాక్ అవ్వాలి..అయ్యేదెప్పుడు బాస్!

పాన్ ఇండియాలో పెద్ద స్టార్లు అయిపోయారు. బాలీవుడ్ హీరోల‌కే పోటీగా మారారు. వీళ్ల‌లో కొంత మంది గ్లోబ‌ల్ రేంజ్ కి రీచ్ అవ్వ‌డ‌మే ఆల‌స్యం.

By:  Tupaki Desk   |   28 April 2025 2:00 PM IST
బౌన్స్ బ్యాక్ అవ్వాలి..అయ్యేదెప్పుడు బాస్!
X

సీనియ‌ర్ హీరోలంతా పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. అందులోనూ వెంక‌టేష్, బాల‌కృష్ణ రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. నాగార్జున,చిరంజీవి కూడా అంతే ఉత్సాహంతో ప‌నిచేస్తున్నారు. ఇక మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ, తార‌క్, ప్ర‌భాస్ ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాలో పెద్ద స్టార్లు అయిపోయారు. బాలీవుడ్ హీరోల‌కే పోటీగా మారారు. వీళ్ల‌లో కొంత మంది గ్లోబ‌ల్ రేంజ్ కి రీచ్ అవ్వ‌డ‌మే ఆల‌స్యం.

మ‌రి ర‌వితేజ‌, నితిన్, రామ్, శ‌ర్వానంద్, రానా, అఖిల్, వ‌రుణ్ సందేశ్, విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రిస్థితి ఏంటి? అంటే ఉన్న ప‌ళంగా స‌క్సెస్ ప‌డితే త‌ప్ప బౌన్స్ బ్యాక్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. `ధ‌మాకా` త‌ర్వాత రాజా నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్నీ ప్లాప్ చిత్రాలే. `భీష్మ` త‌ర్వాత నితిన్ నుంచి ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి ప‌రిస్థితి అంతే. ఇక రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్` త‌ర్వాత ఐదు సినిమాల‌తో ప్రేక్షకులు మందుకొచ్చాడు.

కానీ అవ‌న్నీ నిరాశ‌నే మిగిల్చాయి. ఇక యంగ్ హీరో శ‌ర్వానంద్ మంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ఎక్కువ‌గా ల‌వ్ స్టోరీల్లో క‌నిపిస్తున్నాడు. కానీ ఆవేవి స‌క్సెస్ అవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం మూడు సినిమాలు సెట్స్ లో పెట్టాడు. ఇక రానా హీరోగా సినిమా చేసి మూడేళ్లు అవుతుంది. మ‌ధ్య‌లో గెస్ట్ అపిరియ‌న్స్ లు కొన్ని చిత్రాల్లో ఇచ్చాడు. ఆ రెండు పేరుకు చేసిన చిత్రాలే. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోగా కొత్త సినిమా ప‌ట్టాలెక్కించ‌లేదు.

అలాగే అక్కినేని వార‌సుడు అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` త‌ర్వాత చేసిన ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించలేదు. దీంతో స‌క్సెస్ అనివార్య‌మైంది. `లెనిన్` తో అది సాధ్య‌మ‌వుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నాడు. మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ కూడా ఇదే ప‌రిస్థితి. ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ ప‌న‌వ్వ‌డం లేదు. మేర్ల పాక గాంధీ ప్రాజెక్ట్ తోనైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్నాడు. ఈ హీరోలంతా హిట్ తో బ్యాన్స్ బ్యాక్ అవ్వ‌క‌పోతే మార్కెట్ పై మ‌రింత ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంటుందని విశ్లేష‌కులు అంచ‌నా అంచ‌నా వేస్తున్నారు.