Begin typing your search above and press return to search.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ!

ఇక ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల గాసిప్స్ రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   31 July 2023 6:10 AM GMT
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ!
X

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈసారి మరొక విభిన్నమైన కాన్సెప్ట్ ద్వారా రాబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క.. ఇప్పుడు చేసే సినిమాలు మరొక లెక్క.. అనే విధంగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాతో రాబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సినిమా పై అంచనాల ను పెంచే విధంగానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి.


ఇక ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల గాసిప్స్ రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. మొదట ఈ సినిమా కథను మరొక హీరో కోసం అనుకున్నారు అని ఆ తర్వాత మళ్లీ మరొకరిని కూడా అడిగారు అని ఇలా చాలా రకాలు కథనాలు అయితే వచ్చాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా లో విశ్వక్సేన్ క్యారెక్టర్ పేరు లంకల రత్న. స్టోరీ మొత్తం కూడా అతని క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది.

ఒక సాధారణ గోదావరి కుర్రాడు ఉన్నత స్థాయి లో ఉండే పవర్ఫుల్ వ్యక్తుల ను ఎలా ఎదిరించాడు అని లైన్ తోనే.. ఈ సినిమా ను దర్శకుడు కృష్ణ చైతన్య వెండితెర పై ఆవిష్కరించబోతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లో మెయిన్ హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో తెలుగమ్మాయి అంజలి కూడా కనిపించబోతోంది. ఆమె పాత్ర ఈ సినిమా లో చాలా కీలకం కానుంది.

ఇక ఆ మధ్యకాలం లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పై ఊహించిన విధంగా కొన్ని గాసిప్స్ అయితే పుట్టుకొచ్చాయి. ఈ గోదావరి కథను మొదటి నితిన్ తో చేయాలని అనుకున్నారని దానికి పవర్ పేట అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అని ఇలా రకరకాల కథనాలు అయితే కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చాయి. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. అసలైతే పవర్ పేట కోసం దర్శకుడు కృష్ణ చైతన్య రాసుకున్న కథ కంప్లీట్ గా డిఫరెంట్. దాని ని ఏలూరు బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా తెరపైకి తీసుకు రావాల ని అనుకున్నారు. కానీ నితిన్ డేట్స్ సెట్టవ్వక కుదరలేదు.

ఇక విశ్వక్ సేన్ చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. పవర్ పేట కథకు దీనికి అసలు ఈ మాత్రం సంబంధం లేదు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో చూస్తే సినిమా కథ ఇసుక పడవలో హీరో స్టిల్ హైలెట్ అయ్యింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది ఇసుక మాఫియా చుట్టూ తిరిగే ఒక పొలిటికల్ టచ్ ఉన్న స్టోరీ అని అర్ధమవుతుంది. రా అండ్ రస్టిక్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథకు నితిన్ ను ఎంతమాత్రం అనుకోలేదు కానీ శర్వానంద్ ను హీరోగా అనుకున్నారు. కానీ అతని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో విశ్వక్ సేన్ ను తీసుకున్నారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మేకింగ్ విధానం అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక నైజాం కుర్రాడు అయిన విశ్వక్ సేన్ గోదావరి స్లాంగ్ పై పట్టు సాధించి సినిమా చేస్తూ ఉండడం మెచ్చుకోదగిన విషయం.