Begin typing your search above and press return to search.

కొత్త‌గా కొంగొత్త‌గా రెడీ అవుతున్నారా?

కొత్తక వింత! అవును కొత్త‌గా ఏ ప‌నిచేయాల‌న్నా? ఓ ర‌క‌మైన ఎగ్జైట్ మెంట్ కి లోన‌వుతుంటాం.

By:  Tupaki Desk   |   6 April 2024 7:30 AM GMT
కొత్త‌గా కొంగొత్త‌గా రెడీ అవుతున్నారా?
X

కొత్తక వింత! అవును కొత్త‌గా ఏ ప‌నిచేయాల‌న్నా? ఓ ర‌క‌మైన ఎగ్జైట్ మెంట్ కి లోన‌వుతుంటాం. ఆ ప‌ని ఎప్పుడెప్పుడు చేద్దామా? అన్న ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. తాజాగా కొంత మంది స్టార్ హీరోలు పాత సినిమాల సెట్స్ నుంచి కొత్త చిత్రాల సెట్స్ కి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమాల రెంగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడు మొద‌లువుతుందా? అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్...ప్ర‌భాస్... మ‌హేష్‌..బ‌న్నీ... విజ‌య్ దేవ‌ర‌కొండ అంతా ఎంతో ఉత్సాహంగా అందుకోసం ఎదురు చూస్తున్నారు.

ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే చ‌ర‌ణ్ న‌టిస్తోన్న `గేమ్ ఛేంజ‌ర్` షూట్ జూన్ తో ముగుస్తుంద‌ని..అనంత‌రం ఆర్సీ 16 సెట్స్ కి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు. ఇందులో అత‌డి పాత్ర‌...లుక్ అంతా గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఉంటుంద‌ని స‌మాచారం. అందుకోస‌మే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూట్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అని చూస్తున్నాడు. ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `వార్ -2` షూట్ కోసం అంతే ఉత్సాహంగా ఉన్నాడు. తొలిసారి హృతిక్ రోష‌న్ తో క‌లిసి ప‌ని చేయ‌బోతున్న చిత్రం కావ‌డంతో కొత్త ఫీల్ ని ఆస్వాదించ‌బోతున్నాడు.

ఇంత‌వ‌ర‌కూ సౌత్ న‌టుల‌తోనే ప‌నిచేసిన తార‌క్....తొలిసారి హృతిక్ తో న్యూఫీల్ ని ఆస్వాదించ‌బోతున్నాడు. ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో తార‌క్ రోల్ అంతే ఉత్కంఠ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక డార్లింగ్ ప్ర‌భాస్ `స‌లార్ -2` షూట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. శౌర్యంగ‌ప‌ర్వం నుంచి ఖాన్స‌ర్ ని ఎలా చేజిక్కించుకోబోతున్నాడు? అన్న‌ది ఇందులో చూపించ‌బోతున్నారు. ఆ రోల్ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో తెలిసిందే. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ -రాజమౌళి సినిమా కోసం అంద‌రికంటే ఉత్సాహంగా ఉన్నాడు.

ఆయ‌న నుంచి పిలుపు ఎప్పుడు వ‌స్తుంది? మ్యాక‌ప్ వేసుకునేది ఎప్పుడు? అంటూ వెయిట్ చేస్తున్నాడు. ఇక `పుష్ప‌-2` షూట్ ముగింపుకు చేరుకోవ‌డంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అట్లీ కోసం ఎదురు చూస్తున్నాడు. అట్లీ త‌న‌ని ఎలా చూపించ‌నున్నాడు? అన్న ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాడు. అలాగే రౌడీ బోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా గౌత‌మ్ తిన్న‌నూరి త‌న‌ని ఎంత క్రియేటివ్ గా హైలైట్ చేస్తాడు? అని ఎదురు చూస్తున్నాడు. `జెర్సీ` త‌ర్వాత లాంగ్ గ్యాప్ అనంత‌రం చేస్తోన్న సినిమా కావడంతో పాన్ ఇండియాలో ఇదో గొప్ప సినిమా అవుతుంద‌ని అంచ‌నాలున్నాయి.