Begin typing your search above and press return to search.

సాయం చేసిన ఫ్యాన్స్‌ కి స్టార్‌ హీరో విందు పార్టీ

ఉన్నట్టుండి ఎందుకు సూర్య ఈ పార్టీ ఏర్పాటు చేశాడా అంటూ తమిళ జనాలు చర్చించుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   4 March 2024 7:12 AM GMT
సాయం చేసిన ఫ్యాన్స్‌ కి స్టార్‌ హీరో విందు పార్టీ
X

తమిళ స్టార్‌ హీరో సూర్య తన అభిమానులకు పార్టీ ఇచ్చాడు. వెజిటేరియన్‌ ఫుడ్‌ ఐటెమ్స్ తో ఫ్యాన్స్ కు పెద్ద పార్టీనే ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఉన్నట్టుండి ఎందుకు సూర్య ఈ పార్టీ ఏర్పాటు చేశాడా అంటూ తమిళ జనాలు చర్చించుకుంటున్నారు.

అసలు విషయం ఏంటి అంటే తమిళనాట గత ఏడాది డిసెంబర్‌ నెలలో మిచాంగ్‌ తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో తూత్తుకూడి, కన్యాకుమారి తో పాటు ఇంకా పలు ప్రాంతాల ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో కోట్లు ఖర్చు పెట్టేందుకు చాలా మంది ముందుకు వచ్చినా నిరాశ్రయులకు అప్పటికి అప్పుడు భోజనం ఏర్పాటు చేయడం మాత్రం సాధ్యం కాలేదు. ఆ సమయంలో తన ఫ్యాన్స్ సహాయంతో సూర్య మరియు కార్తీ లు నిరాశ్రయులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రతి రోజు వేలాది మందికి భోజనం ను వండి వడ్డించారు. అందుకోసం సూర్య బ్రదర్స్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అయితే వారి ఫ్యాన్స్ పాత్ర కూడా అత్యంత కీలకం. అందుకే ఇప్పుడు వారికి పార్టీ ఇచ్చి మరీ వారితో తన సంతోషాన్ని సూర్య పంచుకున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తుఫాన్‌ సమయంలో తాను చేయాలి అనుకున్న సేవా కార్యక్రమాల్లో సహాయంగా నిలిచిన వందలాది మంది ఫ్యాన్స్ ను కాల్‌ చేసి మరీ సూర్య పార్టీకి ఆహ్వానించాడు. చెన్నై లోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్ హాల్‌ లో ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది. సూర్య మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. నెటిజన్స్‌ సెల్యూట్‌ చేస్తూ పోస్ట్‌ లు పెడుతున్నారు.