Begin typing your search above and press return to search.

SSMB29: డైలాగ్స్ కోసం మళ్ళీ అతన్నే దింపుతున్న రాజమౌళి

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   2 April 2024 5:30 PM GMT
SSMB29: డైలాగ్స్ కోసం మళ్ళీ అతన్నే దింపుతున్న రాజమౌళి
X

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకోగలవు, గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డులని గెలుచుకోవచ్చు అని జక్కన్న నిరూపించారు. అలాగే వందల కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాల కథలో దమ్ముంటే ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు వసూళ్లని సాధించవచ్చని బాహుబలి సిరీస్ తో చూపించారు.

ఇక తన సినిమాలకు టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచే రాజమౌళి పక్కా ప్లాన్ స్టార్ట్ అవుతుంది. ఆయన దారిలో ఇప్పుడు చాలా మంది స్టార్ దర్శకులు నడుస్తూ వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. కెరియర్ లో ఇప్పటి వరకు ప్లాప్ లేని దర్శకుడిగా కూడా రాజమౌళి అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో తన పాన్ వరల్డ్ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే వర్క్ షాప్ మొదలుపెట్టి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే రాజమౌళి సినిమా కోసం మహేష్ కూడా ఫిట్నెస్ లో మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి స్క్రిప్ట్ పనులు ఫినిష్ అయితే చేశాడు. ఇక డైలాగ్స్ కోసం ఇటీవల సాయి మాధవ్ బుర్ర గారిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా సాయి మాధవ్ తన మాటలు అందిస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో మొదలైన ఆయన మాటల పర్వం RRR వరకు చాలా పవర్ఫుల్ గా కొనసాగింది. ఎక్కువగా క్రిష్ సినిమాలకు వర్క్ చేస్తూ ఉంటారు. కథను బట్టి క్యారెక్టర్ కు సెట్టయ్యేలా పర్ఫెక్ట్ డైలాగ్స్ అందించగలరు అని చాలాసార్లు రుజువు చేసుకున్నారు.

ఇక రాజమౌళి తో మొదటిసారి RRR కోసం తన డైలాగ్స్ అంధించిన సాయి మాధవ్ ఇప్పుడు SSMB29 కోసం కూడా పెన్ను పవర్ చూపించబొతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి ఒకసారి ఎవరైనా టెక్నీషియన్స్ కనెక్ట్ అయితే అంత ఈజీగా వధులుకోరు. అలానే తరువాత సినిమాలకు కూడా కంటిన్యూ అవుతారు. ఇక డైలాగ్స్ కోసం కూడా మళ్లీ సాయి మాధవ్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక రాజమౌళి మహేష్ ప్రాజెక్టు పాన్ వరల్డ్ రేంజ్ లో 1500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్నట్లు టాక్ వస్తోంది. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా భాగం కానున్నట్లు చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కు ఇంకా టైమ్ పట్టేలా ఉంది. సమ్మర్ తరువాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్ళ సమయం పట్టేలా ఉంది.