Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 'వార్-2'.. అప్పుడే ట్రోల్స్?

మరోవైపు.. సోషల్ మీడియాలో అప్పుడే మరికొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రైలర్ లోని వివిధ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2025 2:03 PM IST
War 2 Trolls
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో వార్-2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆరో చిత్రంగా తీసుకురానున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు.

యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న వార్-2 ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుంటోంది. సినీ ప్రియులను, తారక్ అభిమానులను ఫుల్ గా మెప్పిస్తోంది. ముఖ్యంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కు డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. తారక్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి.

ట్రైలర్ సూపర్ గా ఉందని.. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో అప్పుడే మరికొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రైలర్ లోని వివిధ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ట్రైలర్ లోని ప్రతి షాట్ ను కూడా కంపేర్ చేస్తూ యాంటీ గ్రూప్స్ ఎన్టీఆర్ పై ట్రోల్స్ చేస్తున్నాయి. తారక్ రోల్ కు ఇంపార్టెన్స్ లేదంటూ తప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొట్టేలా చేస్తున్నాయి. సినిమా పూర్తిగా హృతిక్ రోషన్‌ పై దృష్టి సారించినట్లు ఉందని, ఎన్టీఆర్‌ కు పెద్దగా ప్రాముఖ్యం లభించినట్లు లేదని కామెంట్లు పెడుతున్నాయి.

దీంతో తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు వాటిని తిప్పి కొడుతున్నారు. ట్రైలర్ వచ్చాక అనవసరమైన ట్రోల్స్ కావాలని చేయొద్దని కోరుతున్నారు. తారక్ రోల్ కు మంచి ప్రాధాన్యత ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోందని అంటున్నారు. జెన్యూన్ రివ్యూస్ ఇవ్వాలని సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.