Begin typing your search above and press return to search.

హీరో ల మధ్య సిక్స్ ప్యాక్ పంచాయతీ

తాజాగా ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో విశాల్‌ స్పందించాడు.

By:  Tupaki Desk   |   25 April 2025 7:39 AM
హీరో ల మధ్య సిక్స్ ప్యాక్ పంచాయతీ
X

సూర్య హీరోగా నటించిన 'రెట్రో' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రెట్రో సినిమా ఈవెంట్‌లో సూర్య తండ్రి శివ కుమార్‌ పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో శివ కుమార్‌ మాట్లాడుతూ తన కొడుకు సూర్య కెరీర్‌ ఆరంభంలో పడ్డ కష్టాలను గురించి చెప్పుకొచ్చారు. గంటలకు గంటలు డాన్స్ ప్రాక్టీస్‌ చేస్తూ, జిమ్‌లో వర్కౌట్లు చేసేవాడు. ఎంతో కష్టపడితే సూర్య ఈ స్థాయికి వచ్చాడని, కోలీవుడ్‌లో మొదటగా సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసింది తన కొడుకు అని, అతడిని చూసి ఇతర హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ చేశారంటూ శివ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను సూర్య ఫ్యాన్స్ తెగ షేర్‌ చేశారు. అయితే సూర్య కంటే ముందు ధనుష్‌, విశాల్‌ సిక్స్‌ ప్యాక్ బాడీని ట్రై చేశారు.

శివ కుమార్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో వెంటనే కొందరు నెటిజన్స్‌ సంవత్సరాలతో సహా సూర్య కంటే ముందు ధనుష్‌, విశాల్‌ లు సిక్స్ ప్యాక్‌ ట్రై చేశారని, సినిమాల పేర్లను సైతం సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో విశాల్‌ స్పందించాడు. సిక్స్ ప్యాక్ బాడీ విషయమై శివ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను విశాల్‌ ఖండించాడు. వారికి పూర్తి సమాచారం లేదు అనుకుంటా అన్నారు. కోలీవుడ్‌లో ఫస్ట్‌ టైమ్‌ సిక్స్ ప్యాక్‌ బాడీ ట్రై చేసింది ధనుష్‌. వెట్రిమారన్ దర్శకత్వంలో పొల్లాధన్‌ సినిమా కోసం ధనుష్ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించాడు. ఆ సినిమాలో ధనుష్ బాడీకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత నేను సత్యం సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేశాను.

2008లో వచ్చిన సత్యం సినిమా కోసం సిక్స్ ప్యాక్‌ లో కనిపించాను. ఆ లుక్‌తోనే మదగజరాజా సినిమాలోనూ నటించాను. ఆ విషయాలను వాళ్లు మర్చిపోయి ఉండవచ్చు. సినిమా పేర్లు, సంవత్సరాలతో సహా విశాల్ చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. శివ కుమార్‌ వ్యాఖ్యలకు విశాల్‌ కౌంటర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయమై మరింత రచ్చ జరుగుతోంది. సూర్య అభిమానులు వర్సెస్‌ విశాల్‌, ధనుష్ అభిమానులు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో వార్‌ జరుగుతోంది. మా హీరో ముందు సిక్స్ ప్యాక్‌లో కనిపించాడు అంటే.. లేదు మా హీరో సిక్స్ ప్యాక్‌ను మొదట చేశాడు అంటూ కొందరు అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తమిళ సోషల్‌ మీడియాలో ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో తెలుగు నెటిజన్స్ మాట్లాడుతూ.. మీ హీరోల కంటే ముందు మా హీరోలు సిక్స్ ప్యాక్‌లో కనిపించారు. అల్లు అర్జున్‌, నితిన్‌లు మీ హీరోల కంటే ముందు సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించారు. ఈ విషయాన్ని గురించి మీరు ఎందుకు ఈ విధంగా గొడవ పడుతున్నారు అనేది అర్థం కావడం లేదు అంటూ తెలుగు నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు. సూర్య తండ్రి ఏదో యదాలాపంగా అన్న వ్యాఖ్యలను తీసుకుని ఈ స్థాయిలో రచ్చ చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఈ విషయం గురించి విశాల్ స్పందించకుండా ఉండాల్సిందని కొందరు అంటున్నారు.