Begin typing your search above and press return to search.

సిరివెన్నెల నిజమైన చివరి పాట ఇదే!

ఆచార్య ఆత్రేయ‌- సి.నా.రే- వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి లాంటి లెజెండ‌రీ లిరిసిస్టులు క‌ళామ‌త‌ల్లికి ఎంతో గొప్ప సేవ చేసారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:20 AM GMT
సిరివెన్నెల నిజమైన చివరి పాట ఇదే!
X

ఆచార్య ఆత్రేయ‌- సి.నా.రే- వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి లాంటి లెజెండ‌రీ లిరిసిస్టులు క‌ళామ‌త‌ల్లికి ఎంతో గొప్ప సేవ చేసారు. అద్భుత‌మైన సినీసాహిత్యం సృజించిన మేటి ర‌చ‌యిత‌లుగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచారు. వేటూరికి ఇంచుమించు స‌మ‌కాలికుడిగా కెరీర్ ని ప్రారంభించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి తన పాటల ద్వారా తెలుగు సినిమా సాహిత్యానికి అస‌మాన‌మైన‌ సేవ చేసారు. వంద‌లాది పాట‌లు రాసిన ఆయన జాతీయ ఉత్త‌మ గేయ ర‌చ‌యిత‌గా పుర‌స్కారాన్ని అందుకున్నారు. సిరివెన్నెల ఇహ‌లోకాన్ని వీడి స్వ‌ర్గ‌స్తులైనా ఎప్ప‌టికీ తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయ‌న సాహిత్యం మ‌నుగ‌డ సాగిస్తూనే ఉంటుంది. ప్ర‌జ‌ల గుండెల్లో మార్మోగుతూనే ఉంది. సిరివెన్నెల కెరీర్ లో రాసిన చిట్ట‌చివ‌రి పాట ఏది? అంటూ ఇప్పుడు ఒక డిబేట్ అంత‌ర్జాలంలో వేడి పుట్టిస్తోంది.

నాని‍‍‍ శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో సిరివెన్నెల చివరిగా రాసిన పాట ఉందని ప్ర‌చారం సాగింది. కానీ ఇప్పుడు కార్తికేయ నటించిన 'బెదురులంక 2012'లో సిరివెన్నెల చివ‌రి పాట ఉంద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ప్ర‌మోష‌న్స్ లో బెదురులంక నిర్మాత బెన్నీ ముప్పనేని, సంగీత ద‌ర్శ‌కుడు మణిశర్మ, గేయ రచయిత చైతన్య ప్రసాద్, సిరివెన్నెల సహకారంతో క్లైమాక్స్ పాటను రూపొందించామని వెల్లడించారు. వాస్తవానికి, సిరివెన్నెల మరణించిన సమయంలో సగం పాటను రాశారు. మణిశర్మ తన నోట్‌బుక్ లో ఆ పాట జాగృత‌మై ఉంది. దీంతో మిగిలిన లైన్లను చైతన్య ప్రసాద్ నింపేలా చేసారు. అలా ఇప్పుడు సిరివెన్నెల చివ‌రి పాట ఏదో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

సిరివెన్నెల పాట‌ దశాబ్దాలుగా ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తూనే ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను తన సాహిత్య నైపుణ్యంతో సుసంపన్నం చేసిన మేటి ర‌చ‌యిత ఆయ‌న‌. అయితే బెదురులంక 2012 నిర్మాత ఈ పాటను సిరివెన్నెల చివరి పాటగా ప్రచారం చేసి దానిని క్యాష్ చేసుకోవడం ఇష్టం లేదు.. అని బెదురులంక నిర్మాత‌లు తెలిపారు.

సిరివెన్నెల సృజించిన అద్భుత‌మైన పాట‌లు:

విధాత తలఁపున ప్రభవించినది...! అంటూ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో గొప్ప‌ స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ధన మాయను ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశీలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలోను ప్ర‌సిద్ధులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.

ఆయన కలం నుంచి జాలువారిన అనేక వంద‌ల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:

ఆరంగేట్రం సిరివెన్నెల లోని ప్రతి పాట అణిముత్యమే.

*రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయినీ, జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినదీ....

*స్వయంకృషిలోని అన్ని పాటలు..

*స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశంలో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిది

*శృతిలయలులో - తెలవారదేమో స్వామి

* శివలో బోటని పాఠముంది

* క్షణక్షణంలో కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా

* గాయంలో అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు, రాష్ట్ర నంది అవార్డు సాధించిన స్వరాజ్యమవలేని

* గులాబిలో ఏ రోజైతె చూశానో నిన్నూ, క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ

* మనీలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ

* శుభలగ్నం లోని చిలకా ఏ తోడు లేకా

* నిన్నే పెళ్ళడతా లోని కన్నుల్లో నీ రూపమే, నిన్నే పెళ్ళాడేస్తానంటూ

* సింధూరం లోని అన్ని పాటలు ముఖ్యంగా - సంకురాత్రి పండగొచ్చెరో, అర్థ శతాబ్దపూ

* దేవీపుత్రుడు లోని ఓ ప్రేమా

* చంద్రలేఖ లోని ఒక్క సారి ఒక్క సారి నవ్వి చూడయ్యో

* నువ్వే కావాలి నుంచి ఎక్కడ ఉన్నా, కళ్ళలొకి కళ్ళు పెట్టీ

* నువ్వు నాకు నచ్చావు నుంచి ఆకశం దిగివచ్చి

* శుభ సంకల్పం నుంచి హైలెస్సో, సీతమ్మ అందాలూ

* పట్టుదల నుండి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...