రంగంలోకి నాల్గవ సింగం రెడీనా!
`సింగం 4`కి సమయం ఆసన్నమైందా? సూర్య మళ్లి గర్జించాల్సిన సమయమోచ్చిందా? అంటే అవుననే అనాలి.
By: Tupaki Desk | 8 May 2025 3:15 AM`సింగం 4`కి సమయం ఆసన్నమైందా? సూర్య మళ్లి గర్జించాల్సిన సమయమోచ్చిందా? అంటే అవుననే అనాలి. సూర్యకి కొంత కాలంగా సరైన కమర్శియల్ సక్సెస్ ఒక్కటీ లేదు. `కంగువ` తో పీరియాడిక్ ప్రయత్నం చేసి భారీ దెబ్బ తిన్నాడు. ఇటీవలే `రెట్రో` కూడా రిలీజ్ అయింది. ఓ కమర్శియల్ ఎంటర్ టైనర్ గానే రిలీజ్ అయినా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. రెగ్యులర్ సినిమాగా తేలిపోయింది.
దీంతో సూర్యకి బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ తప్పలేదు. ప్రస్తుతం చేస్తోన్న 45వ చిత్రం పక్కా కమర్శియల్ ఎంటర్ టైనరే. కానీ దర్శకుడు కొత్త వాడు కావడంతో ఎలా ఉంటుంది? అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు నాల్గవ `సింగం` రంగంలోకి దిగాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడు తున్నారు. ఉయ్ ఆర్ వెయిటింగ్ అంటూ పోస్టులు చేస్తున్నారు. నిజానికి సింగం 4 ఇప్పటికే చేయాలి.
కానీ హరితో ఎందుకనో చేతులు కలపలేదు. `సింగం 3` రిలీజ్ అయి ఇప్పటికే ఏడేళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి సూర్య-హరి వేర్వేరు చిత్రాలు చేస్తున్నారు తప్ప `సింగం 4` గురించి ఆలోచించలేదు. `సింగం`- `సింగం 2`కి మధ్య కేవలం రెండు..మూడేళ్లు మాత్రమే గ్యాప్ తీసుకున్నారు. కానీ నాల్గవ సింగం విషయంలోనే డిలే చేస్తున్నారు. సరైన స్టోరీ పాయింట్ దొరక్కపోవడంతోనే ఆలస్యం జరుగుతుంది.
పాయింట్ కుదిరిందంటే హరి మెరుపు వేగంతో అల్లుకుపోతాడు. అతడి సినిమాల ఫార్మెట్ ఎలా ఉంటుం దన్నది చెప్పాల్సిన పనిలేదు. వన్ మ్యాన్ షోలా సాగిపోతుంది. హరి గత సినిమా రత్నం కూడా సరైన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం ప్రశాంత్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాతైనా నాల్గవ సింగం పనులు మొదలు పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.