బ్రేకప్ స్టోరీల గురించి... ఎన్నో బాయ్ ఫ్రెండ్ అంటారు!
తాజాగా ప్రముఖ నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
By: Tupaki Desk | 27 April 2025 9:34 AMకమల్ హాసన్ వారసురాలు శృతి హాసన్ కెరీర్ ఆరంభం నుంచి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది. తండ్రి పేరును వినియోగించుకుని ఆఫర్లు దక్కించుకోవడం లేదంటే, తండ్రి పేరును వినియోగించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం ఎప్పుడూ శృతి హాసన్ చేయలేదు. ఇండస్ట్రీలో ఆమె ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలోనే బికినీ ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి హిట్ పడే వరకు తీవ్రమైన ఒత్తిడికి గురి అయినట్లుగా శృతి హాసన్ చెబుతూ ఉండేది. హీరోయిన్‌గానే కాకుండా ఇండస్ట్రీలో నాలుగు కాలల పాటు ఉండే విధంగా ఎప్పుడూ ఏదో విధంగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటాను అంటూ గతంలో శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
తాజాగా ప్రముఖ నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తన ప్రేమ వ్యవహారాల గురించి, తన తల్లిదండ్రులు విడిపోయిన సమయంలో ఎదుర్కొన్న పరిణామాల గురించి, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి శృతి హాసన్ డెప్త్గానే చెప్పుకొచ్చింది. గతంలో ఎప్పుడూ చెప్పని విషయాలను ఈసారి శృతి హాసన్ షేర్ చేసుకోవడంతో ఆమె వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన ప్రతిసారీ ఆమె ప్రేమ వ్యవహారాల గురించి టాపిక్ వస్తుంది. ఆమె ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రియుడికి బ్రేకప్ చెప్పింది. ఆఫ్ ది రికార్డ్ మరికొందరు కూడా ఉండి ఉండవచ్చు అంటారు.
తాజాగా ఆ విషయం గురించి శృతి హాసన్ స్పందిస్తూ... నాతో ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే చాలా మంది ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని అడుగుతూ ఉంటారు. వారు ఆ నెంబర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం నెంబర్ గురించి ఆలోచించను. నేను కోరుకునే ప్రేమ లభించే వరకు ఎన్ని సార్లు అయినా విఫలం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. ఒక వ్యక్తికి బ్రేకప్ అయినంత మాత్రాన తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ప్రేమికులు ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నప్పుడు ఒకరిని ఒకరు తప్పుపట్టకూడదు. రిలేషన్ షిప్లో నిజాయితీగా ఉండాలని నేను అనుకుంటాను, అవతలి వారు మొదట నిజాయితీగా ఉన్నా ఆ తర్వాత ఉండక పోవచ్చు అంది. కోరుకునే ప్రేమ లభించే వరకు వెయిట్ చేస్తానంది.
తన తల్లిదండ్రులు కమల్, సారికలు విడాకులు తీసుకున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురి అయ్యాను. చెన్నై నుంచి ముంబై మకాం మార్చిన సమయంలో బెంజ్ కారులో తిరిగే నేను ముంబై లోకల్ రైల్లో, ట్యాకీ కారులో తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలో జీవితం చాలా నేర్పించింది. అన్ని విషయాలను గుర్తు పెట్టుకుని జీవితంలో ముందుకు సాగుతూ వచ్చాను. తిరిగి నా తండ్రి వద్దకు చేరుకునే వరకు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. అంత ఈజీగా నా జీవితం సాగలేదని, ముందు ముందు కూడా నటిగా తనను తాను నిరూపించుకునేందుకు విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ బోల్డ్‌గా వ్యాఖ్యలు చేసింది.