Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకు జోడిగా అగ్ర దర్శకుడి కూతురు

కార్తీకి జోడీగా వీరుమన్ సినిమాతో అదితీ శంకర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 1:30 AM GMT
స్టార్ హీరోకు జోడిగా అగ్ర దర్శకుడి కూతురు
X

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు శంకర్. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటిగా కెరియర్ ఎంచుకున్న అందాల భామ అదితీ శంకర్. ఈ బ్యూటీ ఇప్పటికే కోలీవుడ్ అడుగుపెట్టి రెండు సినిమాలు చేసేసింది. కార్తీకి జోడీగా వీరుమన్ సినిమాతో అదితీ శంకర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.

ఆ తరువాత శివకార్తికేయన్ కి జోడీగా మావీరన్ మూవీలో నటించింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదనే టాక్ సొంతం చేసుకున్నాయి. నటిగా కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో మూడో సినిమాకి ఒకే చ చెప్పింది. అలాగే మరో ప్రాజెక్ట్ కూడా చేతిలో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా సూర్యకి జోడీగా సూపర్ ఛాన్స్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకోవడం విశేషం.

సూర్య సుధా కొంగర దర్శకత్వంలో రెండో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తోన్న కంగువ కంప్లీట్ అయిన తర్వాత సుధా కొంగర మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో సుధా కొంగర తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. సూరైపోట్రు తర్వాత సూర్య, సుధా కాంబోలో రాబోయే మూవీ కావడం మంచి క్రేజ్ ఉంది.

ఈ సినిమాలో కథానాయికగా అదితీ శంకర్ ని ఫైనల్ చేశారు. సూర్యకి జోడీగా ఆమె కనిపించబోతోందంట. అదితీతో పాటుగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, నజ్రియా, విజయ్ వర్మ కీలక పాత్రలలో నటించబోతున్నారు. కచ్చితంగా అదితీ శంకర్ కి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలి. పాన్ ఇండియా రేంజ్ చిత్రం కావడంతో ఇతర భాషలకి వెళ్ళడానికి ఈ మూవీ మంచి ప్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది.

కార్తీ, సూర్యలతో జత కట్టిన హీరోయిన్స్ లలో అనుష్క, ప్రణీత, కాజల్ అగర్వాల్, తమన్నా తర్వాత స్థానంలో అదితీ శంకర్ కూడా చేరబోతూ ఉంది. సుధా కొంగర మూవీ అంటే గ్యారెంటీ హిట్ అనే టాక్ ఉంది. కచ్చితంగా ఈ చిత్రంతో అదితీ శంకర్ లక్ మారిపోవడం ఖాయం అని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.