Begin typing your search above and press return to search.

ఒక పండ‌గొచ్చింది ఇక‌పై వ‌రుస‌గా అన్ని పండ‌గ‌లే!

ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ త‌న సినిమా కంటే ముందుగా కూట‌మి గెల‌ప‌వ‌డంపై స్పందించాడు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 6:19 AM GMT
ఒక పండ‌గొచ్చింది ఇక‌పై వ‌రుస‌గా అన్ని పండ‌గ‌లే!
X

కూట‌మి గెలుపును యువ హీరో శ‌ర్వానంద్ పండ‌గలా సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక‌పై అన్నీ పండ‌గ‌లే అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసాడు. శ‌ర్వాంద‌న్ హీరోగా న‌టిస్తోన్న శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌న‌మే' తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ త‌న సినిమా కంటే ముందుగా కూట‌మి గెల‌ప‌వ‌డంపై స్పందించాడు.

అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. 'ఏపీ ఎన్నిక‌ల్లోఘ‌న విజ‌యం సాధించిన చంద్ర‌బాబు నాయుడు, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ ల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. క‌ష్ట‌ప‌డ్డారు. మంచి ఫ‌లితం అందుకున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా అనందంగా ఉంది. ఫ‌లితాల‌తో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జూన్ 7న సినిమా రూపంలో మ‌రో పండ‌గ వ‌స్తుంది. దాని త‌ర్వాత 27 క‌ల్కీ రూపంలో మ‌రో పండ‌గ‌. ఇక‌పై అన్నీ మంచి రోజులే. అన్నీ పండ‌గ‌లే వ‌స్తాయి.

ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడూ కొత్త‌ద‌నం ఉండే ఉన్న సినిమాలే ఇవ్వాల‌నుకుంటా. స‌మ‌యం ఎంత విలువైందో ఈ సినిమాలో చూపించాం. అలాగ‌ని మెసెజ్ లు ఏవీ ఇవ్వ‌డం లేదు. చివ‌రి న‌ల‌భై నిమిషాలు మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్తుంది. త‌ప్ప‌కుండా సినిమా మంచి విజయం సాధిస్తుంది. శ్రీరామ్ ఆదిత్య ఎంతో ప్ర‌తిభావంతుడు` అని అన్నారు. ఇదే వేడుక‌లో చిత్ర నిర్మాత టిజి విశ్వ ప్ర‌సాద్ శ‌ర్వానంద్ కు బిరుదు ఇచ్చారు.

ఇంత‌వ‌ర‌కూ శ‌ర్వాకి ఎలాంటి బిరుదు లేదు. అంతా యువ హీరో, య‌త్ స్టార్ అంటూ పిలుచుకునే వారు. కానీ విశ్వ ప్ర‌సాద్ మాత్రం చామింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చాడు. దీనికి సంబంధించి ప్ర‌త్యేక వీడియో ని కూడా ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమా తో శ‌ర్వా సినిమాల టైటిల్ కార్స్డ్ లో ముందుగా చామింగ్ స్టార్ అని ప‌డుతుంది. అభిమానులంతా చామింగ్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.