Begin typing your search above and press return to search.

సమ్మోహనుడా పెదవే ఇస్తా కొంచెం కొరుక్కోవా..!

By:  Tupaki Desk   |   17 July 2023 10:57 AM GMT
సమ్మోహనుడా పెదవే ఇస్తా కొంచెం కొరుక్కోవా..!
X

కిరణ్‌ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రూల్స్ రంజన్‌' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క పాట చొప్పున విడుదల చేస్తున్నారు. జూలై 20వ తారీకు రూల్స్ రంజన్ నుండి సమ్మోహనుడా.. అనే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు.

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న కిరణ్‌ అబ్బవరం మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రూల్స్ రంజన్‌ తో రెడీ అవుతున్నాడు. కిరణ్ గత చిత్రాల మాధిరిగానే విడుదలకు ముందు ఈ సినిమా కి కూడా మంచి బజ్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు. హీరోగా ఈ సినిమా ఆయనకు ఒక మంచి కమర్షియల్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

సినిమా కి అత్యంత కీలకమైన మ్యూజిక్ ను అమ్రేష్‌ గణేష్‌ అందిస్తున్నారు. సమ్మోహనుడా పెదవే ఇస్తా కొంచెం కొరుక్కోవా... ఇష్టసఖుడా నడుమే ఇస్తా నలుగే పెట్టుకోవా అంటూ శ్రేయ ఘోషల్‌ పాడిన పాటను ఈనెల 20న విడుదల చేయబోతున్న నేపథ్యం లో సినిమా పై అంచనాలు పెరగడం ఖాయం అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఎ ఎం రత్నం తనయుడు అయిన రత్నం కృష్ణ దర్శకుడు అవ్వడం వల్ల కూడా ఇండస్ట్రీ వర్గాల్లో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో.. మాస్ సినిమాలతో ఇప్పటి వరకు అలరిస్తూ వచ్చిన కిరణ్ అబ్బవరం ఒక పూర్తి స్థాయి క్లాస్ హీరోగా ఈ సినిమా తో రాబోతున్నాడు.

సమ్మోహనుడా సాంగ్ ప్రోమో వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాటలో నేహా శెట్టి గ్లామర్‌ షో ఓ రేంజ్ లో ఉండబోతుందని ప్రోమో చూస్తేనే అనిపిస్తుంది. కనుక ఈ పాట తో సినిమా కు మంచి బజ్‌ క్రియేట్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.