శరీరాన్నే కాదు ఆత్మను పోషించండి: సమంత
హ్యాపీ వీకెండ్ పేరుతో తన రోజువారీ దినచర్య గురించి తాజాగా సోషల్ మీడియాల్లో రివీల్ చేసింది.
By: Tupaki Desk | 31 May 2025 7:30 PMసమంతా రూత్ ప్రభు ఇటీవల మయోసైటిస్ నుంచి కోలుకుని, ఆరోగ్యవంతంగా మారిన క్రమం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దానికోసం ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణ అవసరమని చెబుతోంది సమంత. తన క్రమశిక్షణ, దృఢ సంకల్పం, ఆరోగ్యంపై అవగాహనతో ఉంటుంది. హ్యాపీ వీకెండ్ పేరుతో తన రోజువారీ దినచర్య గురించి తాజాగా సోషల్ మీడియాల్లో రివీల్ చేసింది. కవర్ చిత్రంలో సమంత ఒక చెట్టు కింద నిలబడి సైలెన్స్ అనే కార్డును పట్టుకుని ప్రశాంతంగా నవ్వుతూ, బుద్ధి, బలం, సానుకూలతలపై సందేశాన్ని ఇచ్చింది.
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆత్మను పోషించడం తాలూకా ప్రాముఖ్యతను సమంత నొక్కి చెప్పింది. జీవితంలో స్పష్టత, స్థిరత్వాన్ని కనుగొనాలనే తన తపన గురించి కూడా వ్యాఖ్యానించింది. మీరు మీ శరీరాన్ని పోషించినట్లుగా మీ ఆత్మను పోషించుకోండి. కొన్నిసార్లు దాని అర్థం నిశ్శబ్దాన్ని ఎంచుకోవడం! అని క్యాప్షన్ ఇచ్చింది. జిమ్‌లో సమంత కఠినమైన శిక్షణను హైలైట్ చేసే ఫోటోలు ఉన్నాయి. రోజు గడిచేకొద్దీ తనను తాను మరింతగా ముందుకు తీసుకెళ్లడం ఆరోగ్యంగా మారడం గురించి సామ్ రివీల్ చేసింది.
సురక్షితం అనుకునే దానికంటే కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒకటి కనుగొన్నానని సమంత తెలిపింది. ఇది అంత సులభం కాదు కానీ అసౌకర్యం మీరు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నారో మీకు చూపించే మార్గాన్ని కలిగి ఉంది అని చిన్న నోట్‌లో రాసింది. ఒకప్పుడు జాడీ మూత తీయలేని నేను, ఇప్పుడు జిమ్‌లో 100 కిలోల బరువును ఎత్తగలనని చెప్పింది.
తన వెల్‌నెస్ జర్నీ గురించి చెబుతూ.. తన టాప్ 3 ఎనర్జీ బూస్టర్ ల గురించి వెల్లడించింది. వాటిలో మంచి నిద్ర, కాఫీ, సప్లిమెంట్ NMN ఉన్నాయి. ఎనర్జీ శిక్షణ తర్వాత స్వీయ సంరక్షణ, కోలుకోవడం ముఖ్యతను తెలుసుకోవాలని అంది. జిమ్‌లో తన తెరవెనుక శిక్షణా దృశ్యాలతో పాటు, సమంత టెన్నిస్ వంటి గేమ్స్ తో చిల్ అయ్యే విషయాలతో వీడియోను కూడా షేర్ చేసింది. నిమ్మ, అల్లం, పసుపు, కారపు మిరియాలు, ఆలివ్ ఆయిల్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆపిల్ సైడర్ వెనిగర్, ఇతర పదార్థాలతో కూడిన తనకు ఇష్టమైన రెసిపీని వెల్లడించింది.
సమంత సొంత బ్యానర్ లో నిర్మించిన శుభం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సిటాడెల్ - హనీ బన్నీ తర్వాత సమంత పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే రక్త్ బ్రహ్మాండ్ కోసం శ్రమిస్తోంది.