ఒక డెసిషన్ కెరీర్‌ను డిసైడ్ చేయలేదు
ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటూ ఎంతో మంచి పేరు, ఫాలోయింగ్ సంపాదించుకుంది.
By: Tupaki Desk | 25 April 2025 10:56 AM ISTఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటూ ఎంతో మంచి పేరు, ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ అవడంతో సమంత అతి తక్కువ కాలంలోనే సౌత్ లోని స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
ఇటీవల కోలీవుడ్ లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్ అవార్డును అందుకున్న సమంత ఈ సందర్భంగా ఆ ఈవెంట్ లో పాల్గొని తన కెరీర్ గురించి పలు ఇంట్రరెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. డైరెక్టర్ కం యాక్టర్ రాహుల్ రవీంద్రన్ తో తన బాండింగ్ ను సమంత బయపెట్టింది. రాహుల్ తో తనకున్న అనుబంధానికి పేరు పెట్టలేనని సమంత తెలిపింది.
మయోసైటిస్ వల్ల తనకు హెల్త్ బాలేనప్పుడు రాహుల్ అక్కడే ఉండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు తనతోనే ఉంటూ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నడని, తను సోదరుడా, ఫ్యామిలీ మెంబరా, బ్లడ్ రిలేషనా, స్నేహితుడా అనేది కూడా చెప్పలేనని తామిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతో స్వచ్ఛమైనదని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
అదే కార్యక్రమంలో సమంత తన ఫ్యాన్స్ గురించి మాట్లాడింది. తనకు ఇవాళ ఇంతమంది ఫ్యాన్స్ ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటున్న సమంత, లక్ తో పాటూ తాను పడిన కష్టమే దానికి కారణమని, ఇదంతా దేవుడిచ్చిన వరమని, మనం తీసుకునే ఒక డెసిషన్ మన కెరీర్ ను డిసైడ్ చేయలేదని, ఎవరైనా అలా డిసైడ్ చేసినా అది అబద్ధమే అవుతుందని, తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో డెసిషన్స్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతాయని సమంత తెలిపింది.
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుధ కొంగర కూడా పాల్గొని ఆమె కూడా సమంత గురించి మాట్లాడింది. సమంతకు తాను వీరాభిమానినని, గత ఐదేళ్లుగా ఆమెను దగ్గర్నుంచి చూస్తున్నానని, ఆమె బాధపడితే తనకు కన్నీళ్లు వచ్చేవని, సమంత ఎంతో ధైర్యవంతురాలని, ఆమెను చూసి అందరూ ధైర్యం తెచ్చుకోవాలని తెలిపింది. సమంతతో సినిమా చేయాలని రెండుసార్లు ట్రై చేసినప్పటికీ కుదరలేదని, ఎప్పటికైనా కచ్ఛితంగా సమంతతో మూవీ చేస్తానని చెప్పగా, సమంత కూడా దానికి స్పందిస్తూ ఇద్దరం కలిసి యాక్షన్ ఫిల్మ్ చేద్దామని చెప్పింది.
