Begin typing your search above and press return to search.

విమర్శలను సవాల్ గా తీసుకుంటా: సమంత

స్టార్ హీరోయిన్ సమంత.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. పాడ్ కాస్ట్ లో.. ఇంటర్వ్యూల్లో.. ఆమె చేసిన కామెంట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   12 May 2025 4:00 AM IST
Samantha Opens Up on Criticism, Failure
X

స్టార్ హీరోయిన్ సమంత.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. పాడ్ కాస్ట్ లో.. ఇంటర్వ్యూల్లో.. ఆమె చేసిన కామెంట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా తనపై వచ్చిన విమర్శలపై రెస్పాండ్ అయ్యారు సమంత. విమర్శలను తాను ఎప్పుడూ ఒక సవాలుగానే స్వీకరిస్తానని తెలిపారు.

"నేను ప్రతిరోజూ నన్ను నేను మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. జీవితం నాపై ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నా.. ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి నేను అలవాటు పడిపోయా. నన్ను విమర్శించినప్పుడు లేదా తిట్టినప్పుడు కూడా.. నేను దానిని ఒక సవాలుగా భావించాను.. భావిస్తాను కూడా" అని చెప్పారు.

"నేను నా జీవితంలో ఎక్కువ భాగం ఐడెంటిటీ కోసం వెతుకుతున్నా. తన ప్రయాణమంతా ఒక పాఠం లాంటిది. ఎవరైనా నా గురించి ఎప్పుడు ఎలాంటి విధంగా తప్పుగా ఆలోచిస్తే పర్వాలేదని నా జర్నీ నాకు నేర్పుతోంది. అందరూ నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. అది సరైన విషయం" అని సమంత తెలిపారు.

తాను కెరీర్ ప్రారంభంలో సక్సెస్ చూశానని చెప్పిన సామ్, వరుస సినిమాలు హిట్ అయ్యానని, దీంతో అంతా గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలిచేవారని అన్నారు. పోటీలో భాగమైపోయానని, కానీ ఫెయిల్యూర్స్‌ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తన మూవీ తొలిసారి ఫ్లాప్‌ అయినప్పుడు కుమిలిపోయానని అన్నారు.

ఇప్పుడు తన కెరీర్‌ తర్వాత సక్సెస్‌ అంటే తన మైండ్ లో డెఫినిషన్ మారిందని చెప్పారు. స్వేచ్ఛగా జీవించడమే విజయం అని అర్ధమైందని వ్యాఖ్యానించారు. తాను అప్పటికన్నా ఇప్పుడే విజయవంతంగా రాణిస్తున్నట్టు చెప్పారు. ప్రతిరోజూ నాకు ఇష్టమైన పనులతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా నిర్మాతగా శుభం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో మా ఇంటి బంగారం మూవీని స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ది రక్త్ బ్రహ్మండ్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు. మహారాణి రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి అప్ కమింగ్ సినిమాలు, సిరీసులతో సామ్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.