Begin typing your search above and press return to search.

ఈ స్ట్రోకులు పాపం ఊహించి ఉండడు

సల్మాన్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో స్పై యూనివర్స్ చిత్రాలలో భాగంగా టైగర్ 3మూవీ గత నెలలో రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 3:59 AM GMT
ఈ స్ట్రోకులు పాపం ఊహించి ఉండడు
X

సల్మాన్ ఖాన్ హీరోగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో స్పై యూనివర్స్ చిత్రాలలో భాగంగా టైగర్ 3మూవీ గత నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది పఠాన్ తర్వాత యష్ రాజ్ నుంచి వచ్చిన మరో స్పైథ్రిల్లర్ మూవీగా ఇది నిలిచింది. పఠాన్ తరహాలోనే టైగర్ 3 కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు. సల్మాన్ ఖాన్ ఈ ఏడాది కిసికి భాయ్ కిసికా జాన్ సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో టైగర్ 3తో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చని భావించారు. ఈ టైగర్ సిరీస్ లో వచ్చిన మొదటి, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సల్మాన్ ఖాన్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాయి. ఈ కారణంగా టైగర్ 3 మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. పఠాన్ మూవీలో కూడా సల్మాన్ టైగర్ క్యారెక్టర్ ని క్యామియోగా పరిచయం చేసి స్పై యూనివర్స్ క్రియేట్ చేయాలని నిర్మాత ఆదిత్య చోప్రా ప్లాన్ చేశారు.

అయితే టైగర్ 3 మూవీ ఎవరేజ్ రేటింగ్స్ తో సల్మాన్ ఖాతాలో మరో డిజాస్టర్ గా చేరింది. ఈ సినిమా ఫ్లాప్ తో యష్ రాజ్ స్పై సిరీస్ సినిమాలకి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. వీటిని కొనసాగించాలా లేదా అనేదానిపై సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికేర్ పఠాన్ వెర్సస్ టైగర్ సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాని హోల్డ్ లో పెట్టాలని అనుకుంటున్నట్లు టాక్.

ప్రస్తుతం యష్ రాజ్ స్పై సిరీస్ లలో భాగంగా వార్ 2 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే యష్ రాజ్ ఈ స్పై సిరీస్ యూనివర్స్ కథలని కొనసాగించే అవకాశం ఉంది. లేదంటే వార్ 2 చిత్రంతోనే వాటికి ముగింపు చెప్పేసే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు స్పై సిరీస్ లలో భాగంగా యష్ రాజ్ నుంచి ఏక్ ది టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్3 సినిమాలు వచ్చాయి. వీటిలో నాలుగు సూపర్ హిట్ అయ్యాయి. టైగర్3 మాత్రమే డిజాస్టర్ అయ్యింది.