Begin typing your search above and press return to search.

సితార నాగవంశీ.. మూడు సినిమాలతో నెవ్వర్ బిఫోర్ రిస్క్!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన కింగ్‌డమ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   9 July 2025 6:00 PM IST
సితార నాగవంశీ.. మూడు సినిమాలతో నెవ్వర్ బిఫోర్ రిస్క్!
X

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్. నాగవంశీ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి స్పీడ్ మీద ఉన్న నిర్మాతల్లో ఒకరు. వరుస విజయాలతో నిర్మాతగా తన మార్క్ ప్రూవ్ చేసుకున్న నాగవంశీ.. ఇప్పుడు మరింత బిజీగా మారారు. ఒకవైపు తన బ్యానర్‌లో డజను సినిమాలు రూపొందుతుండగా, మరోవైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే, రాబోయే నెలలు నాగవంశీకి చాలా కీలకం కానున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన కింగ్‌డమ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇది విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలవబోతోంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, జూలై 31న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. సినిమాకు మాస్ స్టైల్ కాంబినేషన్‌తో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ప్రమోషన్లు త్వరలో మొదలవనున్నాయి.

ఇక కింగ్‌డమ్ తర్వాత మరో రెండు వారాల్లోనే నాగవంశీ డిస్ట్రిబ్యూషన్‌లో మరో బిగ్ మూవీ వార్ 2 విడుదల కానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ అయిన వార్ 2ను తెలుగులో నాగవంశీ భారీ ధరకు తీసుకున్నారు. ఆగస్టు 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా.. అదే రోజు రజినీకాంత్ ‘కూలీ’ కూడా రిలీజ్ కావడంతో మల్టీప్లెక్స్ స్క్రీన్ పరంగా టఫ్ పోరాటం జరగనుంది. అయినా నాగవంశీ పెద్ద స్కేల్ రిలీజ్ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవే కాకుండా.. ఆగస్టు 27న మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన మాస్ జాతర సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న మరో భారీ మాస్ ఎంటర్టైనర్. కమర్షియల్‌గా బాగా హిట్ కావాల్సిన టైమింగ్‌లో వస్తున్న ఈ సినిమా రవితేజకు కూడా చాలా కీలకం. యూత్, బీ సెంటర్లలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కిస్తే నాగవంశీకి మూడు వారాల గ్యాప్‌లో మూడు హిట్స్ కూడా రావచ్చు.

ఇకపోతే ఈ మూడు సినిమాల మీద నాగవంశీ పెట్టిన పెట్టుబడి, మార్కెట్ వ్యాపారం మొత్తం భారీగానే ఉన్నట్లు సమాచారం. ఇది ఆయనకి నెవ్వర్ బిఫోర్ రిస్క్ లాంటిది. నిర్మాతగా 100 కోట్లకు పైనే పెట్టుబడులు పెట్టగా, డిస్ట్రిబ్యూటర్ గా 70 నుంచి 80 కోట్ల మధ్యలో రిస్క్ చేస్తున్నారు. కాబట్టి ఆయన కచ్చితంగా 200 కోట్లు టార్గెట్ పెట్టుకునే ఉంటారు. మూడు సినిమాలు విజయవంతమైతే భారీ లాభాలు వచ్చే అవకాశముంది. కానీ ఒక్క సినిమా ఎక్కడైనా తేడా కొడితే రిస్క్ ఎక్కువే. అందుకే ప్రమోషన్ల దగ్గర నుంచి థియేటర్ ప్లానింగ్ వరకు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు.