Begin typing your search above and press return to search.

ట్రైలర్: రూల్స్ రంజన్.. పబ్ రంజన్ గా ఎలా మారాడు?

తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం కామెడీ సన్నివేశాలతో కట్ చేశారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 7:21 AM GMT
ట్రైలర్: రూల్స్ రంజన్.. పబ్ రంజన్ గా ఎలా మారాడు?
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ కెరీర్ బిజీగా దూసుకుపోతున్నాడు. కానీ ఒక్క సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ సినిమాలతో వచ్చిన అతడు.. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్ధం కానున్నాడు. అదే రూల్స్ రంజన్.

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం కామెడీ సన్నివేశాలతో కట్ చేశారు.

సినిమాలో కిరణ్ అబ్బవరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్ర పోషించాడు. తనకంటూ కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్న వ్యక్తిగా కనిపించాడు. అయితే తాను కాలేజీలో చదువుకున్న అమ్మాయి మళ్ళీ పరిచయం అయితే..ఆమెతో మళ్లీ ప్రేమలో పడటం, తన కోసం రూల్స్ రంజన్ ఉన్న అతడు పబ్ రంజన్ గా మారాడం, ఆ తర్వాత చిన్నపాటి మనస్పర్థలు రావడం? అనంతరం ఏం జరిగిందనేదే అని కథగా తెలుస్తోంది.

ఇక కామెడీ యాక్టర్ వెన్నెల కిషోర్.. కిరణ్ అబ్బవరం టైమింగ్ కామెడీ బాగానే ఉంది. మాస్ ఎలిమెంట్స్ ను తగ్గించి.. కేవలం ఫుల్ ఫన్ కామెడీతో సినిమాను తీర్చిదిద్దనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామర్ తో పాటు కిరణ్ అబ్బవరం తో మంచి కెమిస్ట్రీ నడిపించింది. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మించారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా', 'ఎందుకురా బాబు' పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సలార్' వాయిదా పడటం వల్ల ఆ సినిమా తేదీపై 'రూల్స్ రంజన్' ముందుగా కర్చీఫ్ వేసింది. చూడాలి మరి వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ సహా పలు చిత్రాలతో వరుస పరాజయాలను అందుకున్న కిరణ్ అబ్బవరంను ఈ ఫన్ ఎంటర్ టైనర్ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో..